twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ ముఖ్యమంత్రితో రీల్ సీఎం రానా భేటి.. సీక్రెట్‌గా..

    By Rajababu
    |

    Recommended Video

    NTR Biopic : Rana Declares On Playing A Role In NTR Biopic

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో హిందుపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్, దగ్గుబాటి రానా భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో సినీపరిశ్రమ అభివృద్ధి,అమరావతిలో సినీ టూరిజం లాంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలను చంద్రబాబు వివరించినట్టు తెలిసింది.

    ఏపీ సినీ పరిశ్రమ అభివృద్దికి

    ఏపీ సినీ పరిశ్రమ అభివృద్దికి

    ఆంధ్రప్రదేశ్‌లో అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయి. సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని .. దీనికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించినట్టు తెలిసింది.

    బాబుకు రానా, క్రిష్ సూచనలు

    బాబుకు రానా, క్రిష్ సూచనలు

    కొత్త రాజధాని అమరావతితోపాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డినట్టు కూడా తెలిసింది. అందుకు తగ్గట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని సీఎం దృష్టికి సినీ దర్శకులు క్రిష్, హీరో రానా తీసుకువచ్చినట్టు తెలిసింది.

    ఉన్నత ప్రమాణాలతో

    ఉన్నత ప్రమాణాలతో

    ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని, ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడానికి కి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చూసుకొంటామని పేర్కొన్నట్టు తెలిసింది.

    ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా

    ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా

    బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి మంచి విజయాన్ని అందుకొన్నది. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను పోషిస్తున్నారు. రియల్ సీఎం చంద్రబాబును రీల్ సీఎం రానా దగ్గుబాటి కలవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు పాత్రలో కనిపిస్తున్నందున ఆయన నుంచి కొన్ని సూచనలు తీసుకొన్నట్టు తెలిసింది.

    సంక్రాతికి రిలీజ్

    సంక్రాతికి రిలీజ్

    ఎన్టీఆర్ బయోపిక్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

    English summary
    The NTR biopic is the next big thing Tollywood is excited about. The film, directed by Krish Jagarlamudi, has Balakrishna and Vidya Balan in the lead roles. Before the film could go on floors, the NTR biopic underwent a lot of changes. According to the latest report, the film is being made on a staggering budget of Rs 50 crore. If the reports are believed to be true, NTR biopic is the most expensive movie in Balayya's career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X