twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!

    ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై వర్మ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    నీ అబ్బ సొత్తా?..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’RGV Comments Over NTR Biopic on his Facebook |

    రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. సినిమా టైటిల్ చూస్తుంటే ఈ సినిమా లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈచిత్రం ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేశారు. ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ సోషల్ మీడియా ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు. నా ఎన్ .టి .ఆర్ .... అంటూ మొదలు పెట్టిన వర్మ క్రింది విధంగా వ్యాఖ్యానించారు.

    తెలుగు ప్రజలకి వాళ్ల వాళ్ల దృష్టిలో

    తెలుగు ప్రజలకి వాళ్ల వాళ్ల దృష్టిలో

    ఎన్టీఆర్ గారి గురించి బయట వాళ్లు, వాళ్ల ఇంట్లో వాళ్లు, పార్టీ లోపలున్న వాళ్లు...పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్లు, ఎవళ్ళకి వాళ్లు ఆయన మీద వాళ్లకి ఇష్టమొచ్చిన సినిమాలు తీసుకోవచ్చు. అంత గొప్ప మహానుభావుడి అంతరంగం ఏంటో తెలుగు ప్రజలకి వాళ్ల వాళ్ల దృష్టిలో చూపించవచ్చు.

    ఆ ప్రశ్నకు సమాధానం చూపిస్తా

    ఆ ప్రశ్నకు సమాధానం చూపిస్తా

    అలాగే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లాంటి అతి గొప్ప మహానుభావుడినే ప్రభావితం చేసిందంటే ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు ఆకర్షితులౌతారు అనే ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం నేను నా సినిమాలో చూపించదలచుకున్నాను.

    చరిత్ర వెర్రిబాగులది కాదు

    చరిత్ర వెర్రిబాగులది కాదు

    చరిత్ర అనేది ఎవరో చింపేస్తే చిరిగిపోవడానికో కాల్చేస్తే కాలిపోవడానికి దాచేస్తే తెలియకుండా పోవడానికి వెర్రిబాగులది కాధు ..తెలుగు చరిత్రని గర్వంగా తల ఎత్తుకు తిరిగేటట్టు చేసిన ఘనత ఎన్.టి.ఆర్ గారిది.

    ఆ ఘట్టాన్ని చూపిస్తా

    ఆ ఘట్టాన్ని చూపిస్తా

    ఒక గొప్ప మహానుభావుడు జాతిని ప్రభావితం చేస్తాడు. జాతి ఎపుడు మహానుభావులని ప్రభావితం చేయదు. అలాగే తెలుగుజాతిని ప్రభావితం చేసిన ఎన్టీఆర్ గారిది ఒక చరిత్ర. అలాంటి మహానుభావుడి చరిత్రలో ఎన్.టి.ఆర్ స్వయంగా ప్రపంచానికి చెప్పిన ఒక అతి ముఖ్యఘట్టాన్ని నేను తెర మీద చుపించాలనుకుంటున్నాను.

    నీ అబ్బ సొత్తా.....

    నీ అబ్బ సొత్తా.....

    టీవి9 లో వచ్చిన ఆ బాబు రాజేంద్రప్రసాద్ ఎవడో నాకు తెలియదు. కానీ నన్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వను అన్న వాడి వార్నింగ్ కి నేనిచ్చే సమాధానం- "ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా నీ అబ్బ సొత్తా?

    నీకు దమ్ముంటే....

    నీకు దమ్ముంటే....

    నీకు దమ్ముంటే లక్ష్మీ పార్వతి విషయంలో ఎన్.టి.ఆర్ కి మైండ్ దొబ్బింది అని ఓపెన్ గా చెప్పు కానీ ఎన్.టి.ఆర్ పర్సనల్ ఎమోషన్స్ ని ఇన్సల్ట్ చెయ్యకు".

    ప్రభుత్వాలకు రోల్ మోడల్

    ప్రభుత్వాలకు రోల్ మోడల్

    ఒక ప్రతిభావంతమైన సూపర్ స్టార్, జాతీయ స్థాయిలో రాజకీయాన్ని ప్రభావితం చేసి తర్వాతి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ గా ఎదిగిన ఎన్.టి.ఆర్ మనోభావాల్ని బుద్ధున్న ప్రతి ఒక్కడు గౌరవించడం నేర్చుకోవాలి.

    ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

    ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

    ఇటువంటి సున్నితమైన వ్యక్తిగత భావాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ల మాటలు విని ఎన్.ట్.ఆర్ ఆత్మ క్షోభించడంతో పాటు విపరీతమైన కోపాన్ని కూడా చూపిస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.

    వాళ్లే నిజమైన ఫాలోవర్లు

    వాళ్లే నిజమైన ఫాలోవర్లు

    ఆయన్ని ఫాలో అవ్వడం అంటే ఆయన నిర్ణయాల్ని ఫాలో అవ్వడం. ఆ నిర్ణయం ఏదైనా "బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అనే నిజాయతీ ఉన్నప్పుడే వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు అవుతారు. అలా ఆయా నిర్ణయాల్ని ఫాలో అయినా వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు . లేకపోతే వాళ్ళు దొంగ ఫాల్లోవర్లు

    ఎన్.టి.ఆర్ గారి

    ఎన్.టి.ఆర్ గారి

    ఎన్.టి.ఆర్ గారి నిర్ణయాలను అవమానిస్తే సాక్షాత్తు ఎన్.టి.ఆర్ గారిని అవమానించినట్టే. ఆయన మీదున్న గౌరవం ఈ భూమి మీద ఉన్నంతవరకే కాదు, ఆ తర్వాత కూడా నిలబెట్టాలి. అప్పుడే ఎన్.టి.ఆర్ గారి ఆత్మకి శాంతి కలిగించినట్టు .

    వెండితెరపై అన్నీ వివరిస్తా

    వెండితెరపై అన్నీ వివరిస్తా

    ఇంతకు మించిన వివరణ ఇక్కడివ్వను..వెండితెర మీద ఇస్తా.

    -ఆర్జీవీ.

    English summary
    TDP MLC Babu Rajendra Prasad has warned RGV saying that he should take the permission of CM Chandrababu Naidu, Balakrishna before heading for the NTR Biopic project failing which he needs to face the dire consequences. RGV on his Facebook page came out strongly countering TDP MLC's comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X