షాకింగ్: ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.. సింగపూర్ వెళ్లిన మోక్షజ్ఞ!

Recommended Video

NTR Biopic : Mokshagna Plays A Role In Movie

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం అన్ని అడ్డంకుల్ని అధికమించి జులై 5 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం.. పైగా బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించబోతుండడంతో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించబోతోంది. ఇతర పాత్రల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ యుక్తవయసులో ఎన్టీఆర్ పాత్రని పోషించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 అధికారికంగా ప్రకటన

అధికారికంగా ప్రకటన

ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటించబోతోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ గురించి కూడా వార్తలు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

 ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ

ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ అయితే సరిపోతాడని దర్శకుడు క్రిష్ బాలయ్యని ఒప్పించినట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం శర్వానంద్ ని అనుకున్నారు.

సింగపూర్‌కు పయనం

సింగపూర్‌కు పయనం

మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉండడంతో ఫిట్ నెస్ కోసం మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చర్చ జరుగుతోంది.

 ఎట్టకేలకు షూటింగ్

ఎట్టకేలకు షూటింగ్

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సింది. బాలయ్యతో విభేదాలు రావడంతో తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X