ఫోటోలు: వాల్మీకి వచ్చే వరకు బాలయ్యకు తిప్పలు తప్పలేదుగా!

Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

తన తండ్రి ఎన్టీఆర్ జీవిత గాధని వెండి తెరపై ఆవిష్కరిస్తానని గత ఏడాదే బాలయ్య సంచలన ప్రకటన చేసారు. బాలయ్య ఈ ప్రకటన చేసినప్పటి నుంచి సినీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితంతో అనేక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అనేక వివాదాలు ఉన్నాయి. వాటన్నిటిని బాలయ్య ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అంటూ ఆసక్తికరంగా అంతా చర్చించుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తానేంటో తిరిగి నిరూపించుకున్న దర్శకుడు తేజకు బాలయ్య ఈ చిత్ర పగ్గాలు అప్పగించారు. బాలయ్య సరైన దర్శకుడినే ఎంపిక చేసుకున్నారు అని అంతా భావించారు. ఇటీవల ఎన్టీఆర్ చిత్రం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయింది. ఆ తరువాత తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు చిక్కులు మొదలయ్యాయి.

 అన్నగారి చరిత్ర

అన్నగారి చరిత్ర

అన్నగారి చరిత్ర గురించి తెలుసుకోవడం తెలుగువారికి అత్యంత ఆసక్తికరమైన అంశమే. కానీ ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలంటే అనేక చిక్కుముడులు దాటుకుని కథ సిద్ధం చేసుకోవాలి.

అప్పటి వరకు ఒకే

అప్పటి వరకు ఒకే

ఎన్టీఆర్ సినీజీవితం మొత్తం అప్రతిహతంగా జైత్ర యాత్ర కొనసాగింది. రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగునాట తిరుగులేని విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తరువాతే ఎన్టీఆర్ జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.

దర్శకుడు ఎవరు

దర్శకుడు ఎవరు

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించిన తరువాత బాలయ్య చాలా కాలం సరైన దర్శకుడి కోసం ఎదురుచూశారు. చివరకు తేజని ఎంపిక చేశారు. తేజ అనేక కసరత్తులు చేసి కథ ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుక జరిగింది.

బాలయ్యతో విభేదాలు

బాలయ్యతో విభేదాలు

ఎన్టీఆర్ బయోపిక్ లో కథని ఎక్కడ నుంచి ప్రారంభించి ఎక్కడికి ముగించాలి, ఆయన జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించాలా వంటి క్రియేటివ్ డెసిషన్స్ లో తేజ, బాలయ్య మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే ఈ చిత్రను నుంచి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటన చేశారు.

అనేక ఉహాగానాలు

అనేక ఉహాగానాలు

తేజ తప్పుకున్న తరువాత బాలయ్యకు మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. సరైన దర్శకుడి కోసం వేట ప్రారంభించారు. చివరకు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య ప్రకటన చేసారు. రాముడి చరిత్ర చెప్పే అసలైన వాల్మీకి దొరికాడని, అతడే జాగర్లమూడి క్రిష్ అంటూ ప్రకటన చేశాడు.

రెండవ చిత్రం

రెండవ చిత్రం

బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ రెండవ చిత్రంగా రాబోతోంది. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

నమ్మకాన్ని నిలబెడతా

నమ్మకాన్ని నిలబెడతా

తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని చలన చిత్రంగా రూపొందించే అవకాశాన్ని ఇచ్చిన బాలయ్యకు కృతజ్ఞతలు అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X