‘ఎన్టీఆర్’ బయోపిక్: బాలయ్య సంచలన నిర్ణయం, రేపటి నుండే...
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్రలో స్వయంగా బాలకృష్ణ నటించబోతున్నారు. ఈ సినిమా ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోలేదు. 2018లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఉన్నట్టుండి బాలయ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ముందుగా టీజర్ షూటింగ్
సాధారణంగా అయితే సినిమా షూటింగ్ మొదలైన తర్వాత అందులో నుండి కొన్ని సీన్లు తీసుకుని టీజర్ రెడీ చేయడమో, లేదా టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని సీన్లు షూట్ చేయడమో చేస్తారు. అయితే బాలయ్య చేసే ‘ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో సినిమా మొదలు కాకముందే టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేయబోతున్నారట.

రేపటి నుండే షూటింగ్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపు(డిసెంబర్ 28) నుండే ఈ టీజర్ షూటింగ్ మొదలు పెడుతున్నట్లు సమాచారం. టీజర్ ద్వారా అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు సమాచారం.

టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఉన్నట్టుండి ఇంత హడావుడిగా, షూటింగు కూడా మొదలు పెట్టకుండా టీజర్ చిత్రీకరించడానికి ఓ కారణం ఉంది. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆ రోజు టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

స్ఫూర్తి దాయకంగా
ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాల్యం, సినిమా, రాజకీయ రంగాల్లో ఎదిగిన తీరు, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

తెలుగు జాతి గర్వించేలా చేశారు
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గొప్పదనాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లారు. అందుకే ఈ సినిమాను కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా హిందీలోకూడా విడుదల ప్లాన్ చేశారు.

జీవిత సారాంశం
‘ఎన్టీఆర్ బయోపిక్‌లో నాన్నగారి జీవిత సారాంశం ఉంటుంది. సినిమా ఎక్కడ మొదలు పెడతారు. ఎక్కడ ముగిస్తారు. కాంట్రవర్సీలు ఉంటాయా? ఇలా చాలా అడుగుతున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసు అని అలా అడుగుతున్న వారి అందరి నోరు ఒకే దెబ్బతో మూయించా.' అని బాలయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అన్నారు.

తెరవెనక
ఈ చిత్రాన్ని బాలయ్య, సాయి కొర్రపాటి, విష్ణు ఇంద్రగంటి నిర్మించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలను అందిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ముఖ్యతారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











