‘ఎన్టీఆర్’ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ మీద బాలయ్య క్లారిటీ ఇచ్చారు. త్వరలో దర్శకుడినిప్రకటిస్తానని తెలిపారు.

By Bojja Kumar

తన తండ్రి, ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను తానే చేయబోతున్నట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించారు.

అయితే బాలయ్య ఈచిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర వివరాలేమీ ప్రకటించకుండా వరుస సినిమాలు కమిట్ అవుతూ ముందుకు సాగుతుండటంతో ఈ చిత్రం ఆగిపోయిందనే అనుమానాలు సైతం కొందరిలో వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలయ్య పైసా వసూల్ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు.

త్వరలో దర్శకుడిని ప్రకటిస్తా

త్వరలో దర్శకుడిని ప్రకటిస్తా

ఈ విషయమై బాలయ్య పాత్రికేయులతో బాలకృష్ణ మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ చిత్ర దర్శకుడిని ప్రకటిస్తామని, సినిమా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Recommended Video

Ram Gopal Varma to make Sr. NTR biopic
అన్ని వివరాలు సేకరిస్తున్నాం

అన్ని వివరాలు సేకరిస్తున్నాం

ఈ సినిమా కోసం తమ బంధువులను, తన తండ్రి సహచరుల్ని, ఆయన వద్ద పని చేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నట్టు బాలకృష్ణ వెల్లడించారు. ఈ సినిమా విషయమై ఇటీవలే తాను చెన్నైకు వెళ్లి వచ్చానని, తన తండ్రి సినీ రంగానికి రాకముందు విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పారు.

తండ్రి వారసత్వంగా తీసుకుంది అదే

తండ్రి వారసత్వంగా తీసుకుంది అదే

ప్రతి రోజూ ఉదయం 3.30 గంటలకు నిద్ర లేస్తాను. ప్రతిక్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మర్చిపోను. తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది, తాను నిలబెట్టుకుందీ అదేనని బాలయ్య చెప్పుకొచ్చారు.

పని లేకుండా ఉండలేను

పని లేకుండా ఉండలేను

పని లేకుండా ఖాళీగా ఉండటం నా వల్ల కాదు. తన స్వభావానికి తగ్గట్టుగానే తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తాను చేస్తున్న పనులన్నీ సంతృప్తిని ఇస్తున్నాయని బాలయ్య తెలిపారు.

పైసా వసూల్

పైసా వసూల్

‘పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1న విడుదలవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని బాలయ్య తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఓ బ్రాండ్ ఉందని, ఆయన కథలు, పాత్రలు ప్రేక్షకుడికి బాగా నచ్చుతాయని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X