Ram Charan: నాకు తెలుసు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నా.. మెగా విషెస్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు (మే 20). గత రెండు మూడు రోజుల నుంచే ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డీపీ, ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటనతో కాస్త నిరాశ, ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, తక్కువ సమయంలోనే బర్త్ డే ట్వీట్స్ మిలియన్ చేరుకోవడం ఇలా ప్రతీ విషయంలోనూ నందమూరి అభిమానులు ఆధిక్యతను చూపించారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ వంటివారు చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన ట్వీట్.. ఓ విషయాన్ని గుర్తు చేశాయి. అదేంటో ఓ సారి చూద్దాం.

అప్పుడే ఫిక్స్ అయ్యారు..
రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆర్ఆర్ఆర్ టీమ్ రిలీజ్ చేసిన సర్‌ప్రైజ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రామరాజు కోసం భీమ్ అంటూ విడుదల చేసిన ఆ వీడియోలు అల్లూరిగా రామ్ చరణ్ కనిపిస్తే.. భీమ్‌గా ఎన్టీఆర్ వినిపించాడు. అప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా భీమ్ కనిపిస్తాడు.. అల్లూరి వినిపిస్తాడని.

బాకీ పడ్డానని తెలుసు..
ఎన్టీఆర్ బర్త్ డేపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్.. నాకు తెలుసు నీకో రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నాను.. బెస్ట్ ఇస్తాను అని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను.. ముందున్నాయ్ అసలైన వేడుకలు'అని ట్వీట్ చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ కోసం గిఫ్ట్ రెడీ చేయలేకపోయామని ఆర్ఆర్ఆర్ టీమ్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

చిరు ట్వీట్..
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే భీమ్.. నీవు కన్న కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా'ని ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘తెలుగు ఇండస్ట్రీలోని అద్భుతమైన నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ కోరికలన్నీ నెరవేరాలి తారక్' అని కోరుకున్నాడు.

అల్లు శిరీష్ స్పందిస్తూ..
ఎన్టీఆర్ బర్త్ డేపై అల్లు శిరీష్ స్పందిస్తూ.. ‘తారక్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అభినందనలు.. మీకు ఈ ఏడాదంతా బాగుండాలి.. మీ ఫిట్‌నెస్ ద్వారా మా అందరిలోనూ స్పూర్తినింపినందుకు ధన్యవాదాలు'అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











