twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కాస్టలీ బర్తడే గిప్ట్స్

    By Staff
    |

    ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. అయితే అతను పుట్టినరోజు సందర్భంగా కోటిన్నర విలువచసే BMW 750 కారు,ఐదు లక్షలు విలువ చేసే ప్లాటినమ్ సెల్ తీసుకున్నారు. ఇక అతను వి.వి.వినాయిక్ దర్శకత్వంలో ప్రారంభించిన అదుర్స్ చిత్రంలో నటించటానికి రెడీ అవుతున్నారు. కొడాలి నాని నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం జిమ్ కి వెళ్తున్నాడు. ఏక్సిడెంట్ అనంతరం ఒళ్ళు రావటంతో తిరిగి ఫిట్ అవటానికి పూర్తి స్ధాయిలో కృషి చేస్తున్నట్లు సమాచారం.

    ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ ల దర్శకత్వంలో ప్రారంభమైన అదుర్స్ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కంత్రి తర్వాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్ లో ఉండగా తెలుగుదేశం ప్రచారానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తూండగా ఏక్సిడెంట్ అయ్యింది. డాక్టర్స్ రెస్ట్ తీసుకోమనటంతో ఇన్నాళ్ళూ బయిటకు రాని ఎన్టీఆర్ తన బర్తడే రోజు బయిటకు వచ్చి ఆ తర్వాత ఇరవై రెండు నుంచి రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

    ఇక ఈ సినిమా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రల్లో కనిపించి నవ్వించనున్నారు. కోనవెంకట్ కథ అందించిన ఈ చిత్రం..తన గతం చిత్రం కృష్ణ కన్నా ఎక్కువ నవ్వు లు పూయించే అవకాశముందని వినాయిక్ భావిస్తన్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని కొడాలి నాని, వంశి కలిసి నిర్మిస్తున్నారు.

    వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అదుర్స్ అనంతరం మూడు ప్రాజెక్టులు కమిటయ్యారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సినిమా నల్లమలుపు బుజ్జి..హరీష్ శంకర్ కాంబినేషన్లో ఎమ్.ఎల్.ఎ చిత్రం. అనంతరం దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో బృదావనం చిత్రం. ఈ రెండు చిత్రాలకు తలో మూడు నెలలు కాల్షీట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కె.ఎస్.రామారావు నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కన్ఫర్మ్ గా జరుగుతాయని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X