NTR ఫ్యాన్స్‌కు చేదువార్త.. నిరాశ పడొద్దు అని RRR యూనిట్ ప్రకటన

శరవేగంతో దూసుకెళ్తున్న RRR సినిమా షూటింగ్‌కు కరోనావైరస్ లాక్‌డౌన్ కళ్లెం వేసింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే లాక్‌డౌన్‌లో ఫ్యాన్స్ ఆందోళనను తగ్గించడానికి ఫస్ట్ లుక్, టైటిల్ లుక్, అలాగే రాంచరణ్‌ బర్త్ డే రోజున అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్‌ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ బర్త్ డే రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలకు లాక్‌డౌన్ దెబ్బ తీసింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

NTR Birthday : RRR Team Fail To Deliver Bheem Glimpse First Look Video
 లాక్‌డౌన్ 4.0 కారణంగా

లాక్‌డౌన్ 4.0 కారణంగా

ఎన్టీఆర్ బర్త్ డే మే 20 తేదీన RRR యూనిట్ ప్రత్యేకంగా టీజర్ గ్రీంప్స్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. మే 17 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎన్టీఆర్‌కు మధురానుభూతిని పంచేలా భీమ్ జర్నీని అభిమానులకు అందించాలని ప్రయత్నాలు చేసింది. అయితే మే 17వ తర్వాత లాక్‌డౌన్ 4.0 కొనసాగడంతో ఆ ప్రయత్నాలకు గండి పడింది.

 ఎన్టీఆర్ బర్త్ డే గ్లింప్స్ పూర్తి చేయలేకపోయాం

ఎన్టీఆర్ బర్త్ డే గ్లింప్స్ పూర్తి చేయలేకపోయాం

ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్పెషల్ గ్లింప్స్ ఆశిస్తున్న అభిమానులను నిరాశకు గురిచేయకుండా ఓ ప్రకటనను జారీ చేసింది. లాక్‌డౌన్ పొడిగింపు మళ్లీ జరిగింది. దాంతో మా పనులు పూర్తిగా స్తంభించాయి. అయినా మా వంతుగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాం. కానీ ఎన్టీఆర్ గ్లింప్స్‌ వీడియో పనిని పూర్తి చేయలేకపోయాం. అందుబల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేన ట్రీట్‌ను ఇవ్వలేకపోతున్నాం అని RRR యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

మొక్కుబడిగా చేయొద్దని

మొక్కుబడిగా చేయొద్దని

ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం RRRలోని భీమ్ గ్లింప్స్‌ను అందించలేకపోతున్నాం. కాబట్టి ఆ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయలేకపోతున్నామని తెలుపడానికి చింతిస్తున్నాం. ఎదో మొక్కుబడిగా వీడియోను రిలీజ్ చేయదలచుకోలేదు. దీంతో అభిమానులు నిరాశపడవద్దు. మీరు కాస్త ఓపిక పడితే అంతకంటే గొప్పగా మీకు ఓ కానుకను అందిస్తాం అని RRR ప్రకటనలో తెలిపింది.

 త్వరలోనే మీకు ఆ పండగా

త్వరలోనే మీకు ఆ పండగా

ఎన్టీఆర్ భీమ్‌కు సంబంధించిన ఆవుట్‌పుట్ ఎప్పుడొచ్చినా.. ఎప్పుడు పూర్తయినా మేము మీకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆ రోజే మాకు గొప్ప పండుగలా భావిస్తాం. ఈ అసౌకర్యానికి ఎన్టీఆర్ అభిమానులు నిరాశ పడకూడదు. ప్రత్యేక పరిస్థితుల నెలకొన్న కారణంగానే మేము మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోతున్నాం అని RRR ప్రకటనలో తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X