twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్‌‌‌ లాంటోడు.. కేజీఎఫ్2 తర్వాత యంగ్ టైగర్‌తోనే అంటూ ప్రశాంత్ నీల్

    |

    ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ వేసే అడుగులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఇప్పటి నుంచి ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు ఆ స్థాయి డైరెక్టర్లనే లైన్‌లో పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక్క సినిమాతో స్టార్స్ అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం చాఫ్టర్ 2 చిత్రీకరణలో భాగంగా బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చేసిన ఈ కామెంట్.. నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.

     ఎన్టీఆర్ బర్త్ డే వైరల్..

    ఎన్టీఆర్ బర్త్ డే వైరల్..

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో మిలియన్ విషెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు నందమూరి ఫ్యాన్స్. ఏ హీరోకు దక్కని అరుదైన రికార్డు.. యంగ్ టైగర్‌కు దక్కింది. ఈ ఊపు చూస్తుంటే దాదాపు 20 మిలియన్ల ట్వీట్స్ వచ్చేలా ఉన్నాయి.

    ప్రశాంత్ నీల్ ట్వీట్..

    ప్రశాంత్ నీల్ ట్వీట్..

    ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశాడు. ‘సో.. న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు.. క్రేజీ ఎనర్జీ లాంటి తారక్‌తో మ్యాచ్ అయ్యే శక్తిని తెచ్చుకుంటాను.. హ్యాపీ బర్త్ డే బ్రదర్.. త్వరలోనే కలుస్తా'నని పేర్కొన్నాడు.

    ప్రాజెక్ట్ కన్ఫమ్..

    ప్రాజెక్ట్ కన్ఫమ్..

    ఎన్నో రోజులుగా వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం రాబోతోందని వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రకారం స్టోరీ డిస్కషన్ కూడా అయినట్టు తెలుస్తోంది. ఇక రాకీ భాయ్ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను సృష్టించిన ప్రశాంత్.. ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడో మరి.

     ప్యాన్ ఇండియన్ హీరోగా..

    ప్యాన్ ఇండియన్ హీరోగా..

    ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఆపై త్రివిక్రమ్ సినిమా ఎలాగూ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక ప్రశాంత్ నీల్ గురించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్స్‌తో సినిమా చేయాలని ఎంతో కుతూహలంగా ఉన్న ప్రశాంత్.. తనకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తారక్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తాడు.

    English summary
    Prashanth Neel Wishes To Young Tiger. He says That So….finally I know how it feels like to sit next to a nuclear plant….next time bringing my radiation suit to be around all that crazy energy tarak Happy birthday brother! Have a safe and great day See you soon...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X