twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బర్త్ డే చిచ్చు.. విశ్వక్ సేన్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌ ఫైట్.. ఏం జరిగిందంటే..

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సినీ హీరో విశ్వక్ సేన్ రూపొందించిన పాట ఇప్పుడు వివాదంగా మారింది. ఎన్టీఆర్‌కు ట్రిబ్యూట్‌గా రిలీజ్ చేసిన ఆ పాటపై మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా.. దానికి విశ్వక్ సేన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే ఆ ఇద్దరి మధ్య జరిగిన వాదోపవాదనలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇంతకు ఈ పాట విషయంలో వివాదం ఏమిటంటే..

    ఎన్టీఆర్ బర్త్ డే రోజున

    ఎన్టీఆర్ బర్త్ డే రోజున

    ఎన్టీఆర్‌ బర్త్ డే రోజున విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. అయితే ఆ పాటను ఫలక్‌నుమా దాస్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ రూపొందించగా.. ఆ పాటను ఆ సినిమాలో ఉపయోగించుకోవడానికి వీలు కలుగలేదు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆ ట్రాక్‌కు కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ పాటను తన అనుమతి లేకుండా ఎలా రిలీజ్ చేస్తారని దర్శకుడు వివేక్ సాగర్ ఇన్స్‌టాగ్రామ్‌లో సీరియస్ అయ్యారు.

    వివేక్ సాగర్ ఫైర్

    వివేక్ సాగర్ ఫైర్

    వివేక్ సాగర్ ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో.. విశ్వక్ సేన్ ఈ వీడియోకు నాకు సంబంధం లేదు. అయితే చాలాసార్లు ఆ పాటను ఉపయోగించుకోవద్దని అడిగాను. కానీ మీరు నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆ ట్రాక్‌ను ఖూనీ చేసి అందులోని వైబ్‌ను చంపేశాడు. మీ ప్రవర్తనతో నేను ఓ సంగీత దర్శకుడిగా చాలా మనస్తాపం చెందాను అని పోస్టులో పేర్కొన్నారు.

    సోషల్ మీడియా నుంచి తొలగించాలని

    సోషల్ మీడియా నుంచి తొలగించాలని


    అంతేకాకుండా విశ్వక్ సేన్ రిలీజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించే ప్రయత్నాలను వివేక్ సాగర్ ముమ్మరం చేశారు. ఈ మేరకు సోని మ్యూజిక్‌ నిర్వాహకులను ఇప్పటికే సంప్రదించారు. ఆ పాటపై తనకు పూర్తిగా హక్కులు ఉన్నాయని, తన అనుమతి లేకుండా ఆ పాటను దుర్వినియోగం చేశారని భావిస్తున్నానే అభిప్రాయాన్ని వివేక్ సాగర్ వ్యక్తం చేశారు.

    చాలా మంది కష్టానికి ఫలితం అది

    చాలా మంది కష్టానికి ఫలితం అది

    ఇలాంటి వివాదం నేపథ్యంపై వివేక్ సాగర్ స్పందిస్తూ.. ఆ పాటకు సంబంధించి అందులో చాలా మంది కష్టం ఉంది. చాలా మంది కష్ట ఫలితమే ఆ పాట. ఆ పాటను ఫలక్ నామా దాస్ కోసం చేశాం. అంతేగానీ.. ఏదో బర్త్ డే కోసం మాత్రం కాదు. ఆ పాటను నా అనుమతి లేకుండా రిలీజ్ చేసినందుకు తాను చాలా బాధపడ్డాను, మనస్తాపానికి గురయ్యాను అని అన్నారు.

    Recommended Video

    RRR Update : S.S.Rajamouli Special Plan For NTR's First Look Teaser
    ఘాటుగా స్పందించిన విశ్వక్ సేన్

    ఘాటుగా స్పందించిన విశ్వక్ సేన్


    వివేక్ సాగర్ చేసిన ఆరోపణలు, విమర్శలపై హీరో విశ్వక్ సేన్ ఘాటుగా స్పందిస్తూ.. ఎట్టీ పరిస్థితుల్లోనే ఆ పాట హక్కుల మాకు ఉన్నాయి. ఫలక్‌నామా దాస్ కోసం మేం చేయించుకొన్నాం. దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మా విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. ఆ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. ఈ పాటకు సంబంధించి వివేక్ క్రెడిట్ ఇచ్చాం. ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే. అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నాను అని అన్నారు.

    English summary
    Vishwak Sen's Mass Ka Das song which is tribute to NTR on his birthday landed into contrversy. Music Director Vivek Sagar objected the song the way used on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X