twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తోటి హీరోలతో పార్టీ మూడ్ లో ఎన్టీఆర్...( ప్రెవేట్ ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాధారణంగా ఇద్దరు స్టార్స్ మొక్కుబడికి కాకుండా నిజంగా కలిసి స్నేహంగా ఉండటమనేది అరుదైన విషయమే. అయితే ఎన్టీఆర్ దానికి విరుద్దం. ఎన్టీఆర్ ...స్నేహానికి విలుస్తూంటారు. కొద్దిగా ఖాళీ దొరికితే ఇదిగో ఈ ఫొటోలో లాగ స్నేహితులతో గడపటానికి ప్రయారిటీ ఇస్తూంటారు. ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా...వాళ్లు ఎవరో కాదు...మంచు మనోజ్, నాగ చైతన్య, తమిళ హీరో శింబు..వీరందరితో ఉన్న ఎన్టీఆర్. వీరంతా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు అర్దమవుతుంది. చాలా ఫన్నీ ఎక్సప్రెషన్ లతో ఫొటో ఉంది కదా. ఆ ఫొటో మీరూ చూడండి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి మొత్తం టెంపర్ మీదే ఉంది.

    ‘టెంపర్‌' విషయానికి వస్తే...

    "ఇద్దరు కొట్టుకుంటే యుద్దం...అదే ఒకడే మీదడపోతే అది దండయాత్ర" అనే పవర్ ఫుల్ డైలాగుతో ఎన్టీఆర్ వచ్చేసాడు. న్యూ ఇయిర్ కానుకగా పూరి జగన్నాథ్ విడుదల చేసిన టెంపర్ చిత్రం టీజర్ ఇప్పుడు అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. ఈ టీజర్ తో ఒక్కసారిగా చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

    NTR bonding with other stars

    శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్ ను నిన్న రాత్రి విడుదల చేశారు.

    బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'90 శాతం షూటింగ్‌ పూర్తయిం త్వరలో కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహించి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

    ఐటెం సాంగ్స్‌కి క్రేజీ తెచ్చిన డెర్టెక్లర్లలో ఒకరు పూరిజగన్‌. టెంపర్‌ సినిమాలోనూ మొరాకోకు చెందిన మోడల్‌ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. టెంపర్‌ చిత్రానికి ఈ పాటే హైలెట్‌ అవుతుందని టాక్‌. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్‌ కూడా వేసి రంగం సిద్ధం చేసి తీసారు. ఎంత తొందరగా షూటింగ్‌ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు.

    NTR bonding with other stars

    ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

    అలాగే ఈ చిత్రం ఆడియో జనవరి 10న విడుదల అయ్యే అవకాసం ఉంది. థియోటర్ ట్రైలర్ ఫిబ్రవరి 5 న విడుదల చేసి మార్చి చివరకు సినిమాని విడుదల చేస్తారు. ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది.

    కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు.

    ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Now a rare picture of NTR was doing rounds on web and it shows NTR chilling out with his friends.They are none other than Manchu Manoj;Naga Chaitanya and Tamil star Shimbu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X