ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ డిటేల్స్...
సింహా వంటి హిట్ తో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు బోయపాటి శీను తదుపరి చిత్రంకు రంగం రెడీ అయింది. ఎన్టీఆర్ హీరోగా ప్రారంభమయ్యే ఈ చిత్రం విజయవాడలో ప్రారంభం త్వరలో కానుందని తెలుస్తోంది. సి.సి.ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓ ప్రక్క బోయపాటి ఈ చిత్రం కోసం కంటిన్యూగా స్టోరి సిట్టింగ్ లలో పాల్గొంటున్నారు. పక్కా మాస్ మసాలా సినిమాగా..సింహాద్రి తరహా ఎమోషన్స్ తో ఈ చిత్రం ఉండబోతోందని, రెండు మూడు టైటిల్స్ ఇప్పటికే ఎన్టీఆర్ కు చెప్పారని, ఆయన ఓకే చేయగానే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..బృందావనం, శక్తి చిత్రాలు షూటింగ్ లలో బిజీగా ఉన్నారు.
జూ ఎన్టీఆర్ సింహా బోయపాటి శ్రీను బాలకృష్ణ విజయవాడ బృందావనం శక్తి jr ntr shakti boyapati srinu simha balakrishna vijayawada


Click it and Unblock the Notifications