జూ ఎన్టీఆర్, బ్రహ్మీ... మళ్లీ అదుర్స్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే కామెడీ సన్నీవేశాలు ఎంత నవ్వించాయో కదా. అసలు సినిమాకు వారి ఫన్సీ సీన్స్ హైలెట్‌గా నిలిచి సినిమా విజయంలో ప్రధాన భూమిక పోషించాయి. తాజాగా మరోసారి వీరిద్దరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించన్నారు.
తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న 'బాద్ షా' చిత్రంలో మరోసారి వీరి అదరిపోయే కామెడీ రిపీట్ కాబోతోంది. దర్శకుడు శ్రీను వైట్ల అండ్ రైటర్స్ టీం వీరిపై అదిరిపోయే కామెడీ సన్ని వేశాలు ప్లాన్ చేశారు. దూకుడు చిత్రంలో బ్రహ్మానందం నుంచి కామెడీని మాక్సిగమ్ పిండేసుకున్న దర్శకుడు....ఈ చిత్రంలో కూడా అదే రేంజిలో పిండేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో బ్రహ్మానందం ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నారు. హీరోతో కలిసి సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచనున్నాడు.
'బాద్ షా' చిత్రం షూటింగ్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేశారు. చిత్రానికి సంబంధించిన మేజర్ పార్టు ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేస్తోంది. గతంలో బృందావనం చిత్రంలో జూనియర్‌కి తగిన జోడీ అనిపించుకున్న కాజల్ అగర్వాల్ మరోసారి యంగ్ టైగర్ సరసన అవకాశం దక్కించుకుంది.
గతంలో రెడీ, దూకుడు లాంటి విజయవంతమైన ఎంటర్ టైన్మెంట్ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల.....'బాద్ షా' చిత్రాన్ని కూడా హిల్లోరియస్, అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా దట్టించమే కాకుండా....దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు కూడా ప్లాన్ చేశారు. శ్రీపరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా...కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రిప్టు రచయితలుగా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











