జూ ఎన్టీఆర్ తో చేయాలన్న మా కల నిజమైంది
ఎన్టీఆర్‌తో మా బ్యానర్ లో సూపర్‌హిట్ సినిమాను తీయాలన్న మా కల దీంతో నిజమైంది.డిసెంబర్ 2కి మా 'బృందావనం' 158 కేంద్రాల్లో 50 రోజుల్ని పూర్తి చేసుకోనుండటం ఆనందంగా ఉంది అంటున్నారు 'బృందావనం' నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్. 'బృందావనం' అర్ధ శతదినోత్సవం విషయం తెలియచేయటానికి ..వీరు మీడియాతో మాట్లాడుతూ...మా సంస్థ నుంచి వచ్చిన అన్ని చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇకపై కూడా అందరినీ మెప్పించే చిత్రాల్నే నిర్మిస్తాం. ఇంతటి విజయానికి సహకరించిన ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు'' అని అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'బృందావనం' లో కాజల్, సమంత హీరోయిన్స్ గా చేసారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. రెండు కుటుంబాలని హీరో కలిపే కథతో చిత్రం రూపొందింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్..సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రచ్చ అనే చిత్రం చేస్తున్నారు. మరో ప్రక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న శక్తి చిత్రం పూర్తి కావొచ్చింది.


Click it and Unblock the Notifications











