ఎన్టీఆర్ 'బృందావనం' సెన్సార్ రిపోర్టు ఏంటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "బృందావనం" చిత్రం సెన్సార్ పూర్తయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ పూర్తయ్యాక..కమిటీ సభ్యులు.."బృందావనం" టీమ్ ని వండర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందించారంటూ మెచ్చుకున్నారు. ఇక దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో కాజల్, సమంత ఎన్టీఆర్ కి జంటగా చేసారు. ప్రభాస్ మున్నా చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియోకు మంచి పేరే వచ్చింది కాబట్టి ఆదిత్యా మ్యూజిక్ వారు హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











