రోజు తేడాలో ఎన్టీఆర్ 'బృదావనం'...మహేష్ 'ఖలేజా'
మహేష్ ఖలేజా చిత్రం అక్టోబర్ ఏడున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎన్టీఆర్..బృందావనం రిలీజ్ అవుతోంది. దాంతో ఓ విధమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక బృందావనం చిత్రం అక్టోబర్ ఎనిమిదిన తప్పనిసరిగా రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు నిన్న (సోమవారం)సాయింత్రం ప్రకటించారు. దశరా సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక అక్టోబర్ ఒకటవ తేదీన రోబో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఖలేజా చిత్రం ఆడియో కూడా విడుదల కాకపోవటంతో మరికాస్త ఈ చిత్రం వెనక్కి వెళ్తుందని మరికొంతమంది అంటున్నారు. ఏదైమైనా వచ్చే నెల పెద్ద సినిమాలు వరస కడతాయన్నమాట. అయితే అందరూ పండగ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే మాత్రం కష్టం అని విశ్లేషకులు అంటున్నారు.
More from Filmibeat
బృందావనం మహేష్ బాబు ఖలేజా త్రివిక్రమ్ కాజల్ సమంత దిల్ రాజు brindavanam khaleja trivikram kajal dil raju mahesh babu


Click it and Unblock the Notifications











