జూ ఎన్టీఆర్ అభిమానులుకు శుభవార్త
జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం సక్సెస్ సెలబ్రేషన్స్ ని హైదరాబాద్ లో నవంబర్ ఏడవ తేదిన చేయటానికి నిర్ణయించారని సమాచారం. మొదట అక్టోబర్ 30వ తేదీన విజయవాడలో చేద్దామని నిర్ణయించారు. అయితే అనుకోని అవాంతరాలు రావటంతో దిల్ రాజు ఆ పంక్షన్ ని రద్దు చేసుకున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా నందమూరి కుటుంబ అభిమానులందరినీ ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ పంక్షన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విజయవాడ పంక్షన్ రద్దవటంతో బయిట స్పాన్సన్స్ దొరకలేదని, మరొకటి అని రకరకాల రూమర్స్ వినపడటంతో ఈ నిర్ణయం ఎన్టీఆర్ పట్టుపట్టి దిల్ రాజు చేత పంక్షన్ ఏర్పాటు చేయిస్తున్నారని చెప్తున్నారు.
జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం వంశీ పైడిపల్లి కాజల్ సమంత jr ntr dil raju brindavanam vamsi paidipalli kajal samantha


Click it and Unblock the Notifications