»   » నాని గాడు ఆ కులపోడా? అంటూ కామెంట్..... ఫైర్ అయిన నాని!

నాని గాడు ఆ కులపోడా? అంటూ కామెంట్..... ఫైర్ అయిన నాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తనదైన పెర్ఫార్మెన్స్, టాలెంటుతో టాలీవుడ్లో నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండే కేవలం టాలెంటునే నమ్ముకుని ఈ స్థాయికి రావడానికి నాని చాలా కష్టపడ్డాడు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే హీరో అయ్యాడు.

సాధారణంగా ఒకటి రెండు హిట్లు పడ్డాయంటే.... కొందరు కొత్త హీరోలు ఎక్కడలేని తలబిరిసు ప్రదర్శిస్తుంటారు. కానీ నానిలో అలాంటి లక్షణాలు ఇసుమంతైనా కనిపించవు. లెజెండరీ స్టార్లకు, ఇండస్ట్రీ పెద్దలకు, సీనియర్ నటీనటులకు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తుంటాడు నాని.

అభిమాని కామెంటును జీర్ణించుకోలేక పోయిన నాని

అభిమాని కామెంటును జీర్ణించుకోలేక పోయిన నాని

ఎంతో అణకువగా, బాధ్యతగా ఉండే నాని.... తనపై ఓ అభిమాని చేసిన కామెంటును జీర్ణించుకోలేక పోయాడు. వెంటనే అతడికి దిమ్మ దిరిగే రిప్లై ఇచ్చాడు. నానికి అంత కోపం రావడానికి కారణం సదరు వ్యక్తి నాని కులం గురించి ప్రస్తావించడమే.

నాని గాడు కమ్మోడా... అంటూ

ఇటీవల మే 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నాని తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసాడు. దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.... నాని గాడు కమ్మోడా? అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నానికి చిర్రెత్తిపోయింది.

ఘాటుగా రిప్లై

ఘాటుగా రిప్లై

ఆ ట్వీటుకు నాని రిప్లై ఇస్తూ.... మీలాగే నేను తెలుగు వాన్ని, ఎన్టీఆరే కాదు, చిరంజీవి గారికి కూడా పెద్ద అభిమానిని. పెద్దలను గౌరవించగలిగే సంస్కారం ఉన్నవాడిని అంటూ సదరు వ్యక్తికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

నానికి మద్దతుగా వందలాది కామెంట్స్

నానికి మద్దతుగా వందలాది కామెంట్స్

ఈ విషయంలో ట్విట్టర్లో పెద్ద చర్చే జరిగింది. రెండు వర్గాల అభిమానులు వాదోపవాదాలు చేసుకున్నారు. నానికి మద్దతుగా వందలాది మంది అభిమానులు కామెంట్స్ చేసారు.

కామెంట్ డిలీట్ చేసిన సదరు అభిమాని

కామెంట్ డిలీట్ చేసిన సదరు అభిమాని

తన కామెంటుపై పెద్ద గొడవే జరుగుతుండటంతో.... సదరు కామెంటును పోస్టు చేసిన అభిమాని వెంటనే తన కామెంటును డిలీట్ చేసాడు. దీంతో ఆ వివాదం ముగిసినట్లయింది.

English summary
Nani Gave a Befitting Reply to a Mega Fan’s Caste Based Comments on NTR. "“I’M A TELUGU PERSON LIKE YOU,NOT ONLY FOR NTR,EVEN A BIG FAN OF CHIRANJEEVI,RESPECTING ELDERS IS MY HABIT” Nani said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu