RRR: గొడవలు రాకుండా ముందే ఒప్పందాలు చేసుకున్న ఫ్యాన్స్.. అగ్రిమెంట్ పై సంతకాలు
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాల డోస్ అకాశాన్ని దాటేస్తున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ సందడిలో మెగా నందమూరి అభిమానుల మధ్య గొడవలు రాకుండా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ ఒక ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం.

మెగా నందమూరి కాంబో..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పిరియడ్ యాక్షన్ మూవీ RRR లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో ఈ ఇద్దరు కలిసి నటిస్తుండగా మెగా నందమూరి అభిమానుల్లో అంచనాల స్థాయి మామూలుగా లేవనే చెప్పాలి.

ఫ్యాన్స్ వార్?
ఇక తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చిన తరువాత వాతావరణం ఎలా ఉంటుందనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదు. సాధారణంగా ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే RRR లాంటి సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు కాబట్టి ఫ్యాన్ వార్స్ తప్పకుండా ఉండే అవకాశం ఉంటుందని అనుమానాలు వస్తున్నాయి.

అభిమానుల మధ్య ఒప్పందం
అయితే ముందుగానే ఫ్యాన్స్ అసోసియేషన్స్ నడుమ ఒప్పందం కుదుర్చుకోవాడలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ వార్స్ నివారించేందుకు ఇరు వర్గాల అభిమాన సంఘాలు కూడా అగ్రిమెంట్స్ పై సంతకాలు చేయడం జరిగినట్లు సమాచారం. ఒక విధంగా ఇది మంచి పరిణామమే అయినప్పటికీ ఫ్యాన్స్ ఎంతవరకు కంట్రోల్ అవుతారనేది సినిమా విడుదలయ్యే వరకు చెప్పలేము.

అలా చేయకూడదు
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ థియేటర్ వి1భాగాలను క్రమబద్ధీకరించడానికి సమావేశాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఒక స్టార్ ఫ్యాన్స్ మరొక స్టార్ కు కేటాయించిన థియేటర్లకు వెళ్లకూడదు. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ ఉన్న థియేటర్ల వద్ద బ్యానర్లు, నినాదాలు ఉండకూడదు ఒప్పందం చేసుకుంటున్నారు.

ఆ ఫైట్ సీన్ ను ఎలా చూస్తారో?
ఇక ఈ ఒప్పందాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు గాని రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రం చాలా సన్నిహితంగా ఉంటూ ఓ వర్గం అభిమానుల మధ్యలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక సినిమాలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్ ను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా కంగారు లేదని అంటున్నారు. మరి సినిమా విడుదలైన తరువాత ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో చూడాలి.

భారీ బడ్జెట్ తో..
ఇక RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. ఇక దాదాపు 450కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











