కంత్రీ, చిరుత కలిసారు. జ్యోకులు వేసుకున్నారు. పలు విషయాలు చర్చించుకున్నారు. ఏం చక్కా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు కలిసారనే కదా మీ డౌట్. పోయిన సంవత్సరమండీ. పోయిన సంవత్సరం కలుసుకొని ఈ సంవత్సరం దాకా అలానే పక్కన కూర్చునే ఉన్నారు. అయ్యే...అపుడే కొత్త సంవత్సరం వచ్చిందా...అని భారంగా విడిపోయారు. ఇది జరిగింది సినీ కల్చరలర్ సెంటర్ లో. డిసెంబర్ 31 రోజు నైట్ ఈ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో వీరిద్దరూ ఎంచక్కా ఎంజాయ్ చేశారు. ఒకరు సన్సేషనల్ హీరో(చరణ్) అవార్డు తీసుకుంటే, మరొకరు ఉత్తమ నటుడి(జూనియర్ ఎన్టీఆర్) అవార్డును అందుకున్నారు. అభిమానులూ మీరూ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే పోలా. తమ హీరోలు ఎంచక్కా పక్క పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే మనమెందుకు వెర్రి బాగుల్లా కొట్టుకోవడం -తిట్టుకోవడమనుకొని మంచి సినిమా ఎవరిది వచ్చినా చూసి ఎంజాయ్ చేద్దామని ఆ నిర్ణయం తీసుకుంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఇలా చేస్తే మంచి సినిమాలూ వస్తాయి. అనవసరంగా తొడలూ-మెడలూ కొట్టుకోవడం-తిప్పుకోవడాలు ఉండవు కదా. ఆలోచించండి మరి.