ఎన్టీఆర్ 'చురకత్తి' చిత్రం షూటింగ్ షెడ్యూల్ డిటేల్స్
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'చురకత్తి' అనే చిత్రం ఏప్రియల్ లో ప్రారంభం అయి స్ట్రైక్ వల్ల షూటింగ్ అగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్..సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో బిజీ అయ్యారు. దాంతో ఆ షెడ్యూల్ పూర్తి కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ జూన్ మూడవ తేదిన ప్రారంభమై జూన్ పదహారో తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ షెడ్యుల్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కేరళ షెడ్యూల్ ఉంది. పదహారు దాటిన తర్వాత బోయపాటి శ్రీను కేరళ వెళ్ళి లొకేషన్స్ చుసుకుని వస్తారు. ప్రస్తుత షెడ్యూల్ లో శృతిహాసన్, ఎన్టీఆర్ కి చెందిన సీన్స్ తీస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. అలగ్జాండర్ వల్లభ గతంలో ఎవరే అతగాడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ప్రియమణి హీరోయిన్ గా చేసిన ఆ చిత్రం భాక్సాఫిస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో ఆ తర్వాత ఇలా నిర్మాతగా కంటిన్యూ కావాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











