'దమ్ము' పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము చిత్రం ఈ రోజు దాదాపు 1200 వందల స్క్రీన్స్ తో ప్రపంచమంతటా విడుదల అవుతోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రెడీ అయిన ఈ చిత్రాన్ని సింహా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఎన్టీఆర్ సినిమాకు ఎప్పటిలాగే అబిమానులు నీరాజనాలు పడుతున్నారు.
ఈ చిత్రం హైలెట్స్:
* జూ ఎన్టీఆర్ చెప్పే మాస్ డైలాగులు మరియు డాన్సెస్
* ఫైట్ సీక్వెన్స్ లు
* సాంగ్స్ పిక్చరైజేషన్
* ట్విస్ట్ లతో కూడిన కథ
* ఎన్టీఆర్ ఎనర్జిటిక్ నటన
* నలుగురు హీరోయిన్స్ తో ఎన్టీఆర్ చేసిన వాస్తు బాగుందే సాంగ్
* పవర్ పుల్ పంచ్ డైలాగులు
* బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ లు
* పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజికి ఇచ్చిన కీరవాణి
పాజిటివ్ పాయింట్స్:
* పోటీగా వేరే ఏ తెలుగు చిత్రం ఈ వారంలో విడుదల కాకపోవటం
* సినిమాపై ఉన్న భారీ ఎక్సపెక్టేషన్స్
* ఊహకు అందని కథ,కథనం
* హై టెక్నికల్ వ్యాల్యూస్, కధ, ఫైట్స్, సెట్స్
* విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్
* సినిమా దాదాపు 1200 ధియోటర్స్ లో రిలీజ్ అవటం
* డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మంచి రేటుకు పోవటం
నెగిటివ్ పాయింట్స్:
* సింహాతో పోల్చి చూడటం, బోయపాటి రొటీన్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని రిపీట్ కావటం.
* విపరీతమైన హింస: సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికేట్ ఇవ్వటం కొంత వరకూ ఫ్యామిలీలకు ఇబ్బంది.
* దాదాపు 20 డైలాగులు దాకా సెన్సార్ కట్ చేసి వేరేవి పెట్టమని సూచించటం.
ఇక ఈ చిత్రం ఫస్టాఫ్ 92 నిముషాలు, సెకండాఫ్ 67 నిముషాలు ఉంటుంది. ఫస్టాఫ్ కామిడీతో నడిచిపోతే, సెకండాఫ్ మొత్తం ఎమోషన్స్, యాక్షన్ తో ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications











