విజువల్ ఎఫెక్ట్స్ తో జూ ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దమ్ము' చిత్రంలో ఓ పాట కోసం విజువల్ ఎఫెక్స్ట్ బాగా ఉపయోగిస్తున్నారు. ఈ పాట కోసమే రామోజీ ఫిల్మ్‌సిటీలో నాలుగు భారీ సెట్లను నిర్మించారు. రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న గీతమిది. అందుకనుగుణంగానే ప్రత్యేక పద్దతిలో షూటింగ్ చేస్తున్నారు. ఈ పాట సినిమాలో హైలెట్ కానుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు.
ఇక దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్ లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











