‘దమ్ము’ టైటిల్ డిజైన్ ఫస్ట్‌లుక్(అఫీషియల్)
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా సినిమా 'దమ్ము' చిత్రానికి సంబంధించి టైటిల్ అఫీషియల్ డిజైన్ ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. ఈ డిజైన్ అద్భుతంగా ఉందని, టైటిల్ లోనే సినిమా దమ్మేంటో స్పష్టం అవుతోందని అభిమానులు అంటున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న దమ్ము చిత్రంలో త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం అభిమానులకు పూర్తి విందైన కమర్సిల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మార్చి 19న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడే జూ ఎన్టీఆర్, త్రిషలపై మరికొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...దమ్ము చిత్రం విడుదలకు ముందే బిజినెస్ పరంగా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్‌ను డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. వీటి ద్వారా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 40 కోట్ల వరకు వసూలు చేసిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











