TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టెంపర్: ఎన్టీఆర్ డాన్స్ లైక్ ఎ డ్రీమ్....
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘టెంపర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది కెనయడిన్ బ్యూటీ మొరాకన్ సంతతికి చెందిన నారో ఫతేహి. బాలీవుడ్ చిత్రం ‘రోర్-టైగర్స్ ఆఫ్ ది సుందరబన్' ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగానికి పరిచయం అయింది.
ఆమె జూ ఎన్టీఆర్‌తో కలిసి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసింది. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆమె మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ చాలా ఫెక్సిబుల్, ఆయన డాన్స్ లైక్ ఎ డ్రీమ. సినిమా పరిశ్రమలోని బెస్ట్ డాన్సర్లలో ఆయనా ఒకరు' అంటూ ప్రశంసల వర్షం కురిపించింది నారో పతేహి.
తాజాగా అమ్మడు ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఓ పార్టీకి వెళ్లినపుడు ఏం ఫుచ్చుకుంటారు అంటే ‘సెక్స్ ఆన్ బీచ్' కావాలంటోంది. ఆమె నుండి వచ్చిన ఈ సమాధానం విని అంతా విస్తుపోతున్నారు. అయితే తర్వాత అసలు విషయం తెలుసుకుని తెగ నవ్వుకుంటున్నారు. ‘సెక్స్ ఆన్ బీచ్' అనేది ఓ కాక్టైల్ పేరు. వోడ్కా, మరికొన్ని పానీయాలు కలిపి కలిపి దీన్ని తయారు చేస్తారు. వీదేశాల్లో ఇది చాలా ఫేమస్.

టెంపర్' చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ఫోటోస్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.