లోపలున్న ఒరిజనల్ ని..బయిటకు తీస్తే రచ్చే...ఎన్టీఆర్
సిటీ నుంచి వచ్చాడు...సాప్ట్ గా లవర్ బోయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నారేమో...క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా..లోపల ఒరిజనల్ అలానే ఉంది..దాన్ని బయిటకు తీసావనుకో రచ్చ..రచ్చ..అంటూ ఎన్టీఆర్ తన తాజా చిత్రం బృందావనంలో ఓ డైలాగు చెప్తారు. ఇదే డైలాగుని..రీసెంట్ గా జరిగిన బృందావనం ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పి టప్పట్లు కొట్టించుకున్నారు. ఇక ఈ డైలాగు సింహాలో సూపర్ హిట్టయిన నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే వినాలి...అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగును మరిపిస్తుందంటున్నారు. కాజల్, సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సగం సిటీ, మరికొంత పల్లె బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందంటున్నారు. పల్లె బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ..సీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వరస ప్లాప్ ల్లో ఉన్న దిల్ రాజు ఈ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వస్తారని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











