‘బాద్ షా’ఫస్ట్ రోజు నుంచి ఎన్టీఆర్ ఫైటే
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'బాద్ షా'అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం రేపటి నుంచి అంటే ఆగస్టు 15 నుంచీ ధాయల్యాండ్ లో జరగనుంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ ఈ లెంగ్తీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. అక్కడ ప్రారంభం రోజు నుంచి ఎన్టీఆర్ ఫైట్ లో పాల్గొంటారు. విలన్ గ్యాంగ్ కీ,ఎన్టీఆర్ కి మధ్య జరిగే ఫైట్ ఇది. దాంతో ఇటలీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకువచ్చిన జూ.ఎన్టీఆర్ బ్యాంకాక్ కి ప్రయాణం పెట్టుకున్నారు.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫెరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. దూకుడు జోరు మీద ఉన్న శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా శ్రీను వైట్ల రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.అలాగే కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు.
ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. ఇక ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.


Click it and Unblock the Notifications











