»   » అంతపని చేసింది మనోడేనా..? వినోద్ రాయల్ హత్య వివరాలు కనుక్కుంటున్న ఎన్టీఆర్..??

అంతపని చేసింది మనోడేనా..? వినోద్ రాయల్ హత్య వివరాలు కనుక్కుంటున్న ఎన్టీఆర్..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుఇడ్ ని ఇప్పుడు కుదిపేస్తున్న విషయం పవన్ ఫ్యాన్ హత్య... అదీ మరో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్ప బడుతున్నవాళ్ళ చేతిలో. ఈ ఒక్క సంఘటనతో ఈ ఇద్దరు హీరోలూ విపరీతమైన ఒత్తిడిలో పడ్డారు. అసలు తమ ప్రమేయం కూడా లేని సంఘటను కారణం మాత్రం తామే అయినందుకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి.

అయితే చనిపోయిన వ్యక్తి పవన్ అభిమాని కావటం..., ఆయన పార్టీ కార్యకర్త కూడా కావటం తో పవన్ కాస్త త్వరగానే స్పందించాడు. వెంటనే తిరుపతి వెళ్ళి మరణించిన వినోద్ కుటుంబాన్ని ప్రత్యక్షంగా ఓదార్చటమే కాకుండా ఈ కేసు విషయం లో తన పూర్థి సహకారం ఉంటుందనీ హామీ ఇచ్చారు... ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.

NTR Enquiry about Vinod Royal case

అయితే ఈ సంఘటనతో చిక్కుల్లో పడ్డది మాత్రం ఎన్టీఆరే... ఎందుకంటే ఆయన వెంటనే స్పందించి తిరుపతి వెళ్ళినా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే... పోనీ వెంటనే మీడియాలో ఏదైనా ప్రకటన చేద్దామా అనుకునే లోగానే మీడియాలో ఆయన అభిమానే అంటూ వస్తున్న కథనాలతో. మీడియా హోరెత్తిస్తూంటే అసలు ఏవరో "తన అభిమాని అని చెప్పుకునే వ్యక్తి ఒక నేరం చేస్తే దానికి అసలేవిధంగా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని సంధిగ్దం లోనే ఉన్నాడట యంగ్ టైగర్". ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ అంటూ బ్రేకింగ్ న్యూస్ లని టెలికాస్ట్ చేయటంతో అంతా రచ్ఛగా మారింది. ఇదిలా ఉంటే అసలు జరిగిన కథ ఏంటి అనేదానిపై ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు.

అలాగే ఈ ఇద్దరు టాప్ హీరోలు సైతం వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు రావటం అనేది ఏ హీరో కూడ ఎంకరేజ్ చేయరు. అలాంటిది ఫ్యాన్స్ మధ్య గొడవలు...చివరకు చంపుకునే వరకూ రావటం అనేది శోచనీయం. అయితే జూనియర్ ఫ్యాన్స్ దీనిపై సమగ్ర నివేధికను హీరోకి అందజేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మితిమీరిన అభిమానం తో ఏ హీరోని అయితే అభిమానించాడో ఆతనికే తలవంపులుగా మారిన ఆ అభిమాని అసలు ఆరోజు గొడవలో ఎందుకలా చేయాల్సి వచ్చిందో కనుక్కునే ప్రయత్నం లో ఉన్నారట.

ఈ విషయంపై యంగ్ టైగర్ సైతం బాధపడ్డాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అభిమానుల మధ్య ఈ తరహా వాతావరణం అనేది ఏ మాత్రం మంచిది కాదని హీరోల భావన. తాజాగా పవన్ కల్యాణ్ తిరుపతిలో మరణించిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసును సీబీఐ విచారణ కూడా కోరతామని తెలిపారు. హీరోలు ఎప్పుడూ కలిసి ఉంటారు..వారి మధ్య ఎటువంటి విభేదాలు ఉండవని ఈ విషయాన్ని అభిమానులు కూడ గుర్తించాలని మళ్ళీ మళ్ళీ చేప్పటం తప్ప ఇంకేం చేయగలడు ఏ హీరో అయినా....

English summary
Buzz is that Young Tiger NTR wants to know the fackts about Vinod Royal's Death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu