బిగ్ బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్.. ఏక్షణమైనా జరగొచ్చు!
నాని హోస్ట్ గా వ్యహరిస్తున్న బిగ్ బాస్ 2 షో విజయవంతంగా సాగుతోంది. 16 మంది సభ్యులు కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది.
కానీ టిఆర్పి రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుక బడ్డట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న తొలిసీజన్ కు వీక్ డేస్ లో దాదాపు 9 రేటింగ్ వచ్చేది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 కు వీక్ డేస్ లో 7 రేటింగ్ వస్తోంది. తగ్గుతున్న రేటింగ్ ని పెంచడానికి బిగ్ బాస్ మసాలా పెంచుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లోకి సడన్ విజిట్ చేయబోతున్నాడని అంటున్నారు. గెస్ట్ గా ఎన్టీఆర్ ఏక్షణానైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేటింగ్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళతాడనేది ఇప్పటికైతే సీక్రెట్.


Click it and Unblock the Notifications











