పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ వైఫ్.. అభయ్‌కి తమ్ముడొచ్చాడు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలోకి మరో నంబర్ కలిసింది. గర్భవతిగా ఉన్న ఎన్టీఆర్ సతీమని లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. అంటే అభయ్ రామ్ కు తమ్ముడొచ్చాడన్నమాట.

ఎన్టీఆర్ కు అభిమానులంతా అభినందనలు తెలియజేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులకు అభయ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. రెండవ కొడుకు పుట్టిన సందర్భంగా తన సంతోషాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ లో తెలియజేశాడు.
మా ఫ్యామిలీ ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది. అబ్బాయి పుట్టాడు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు.


Click it and Unblock the Notifications