లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో అవాస్తవాలే ఎక్కువ.. పిల్లలు పుట్టేలా ఆపరేషన్.. సంచలన విషయాల వెల్లడి

Recommended Video

NTR Family Friend Dr Kusuma About Lakshmi's NTR Movie And Lakshmi Parvathi || Filmibeat Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదల తర్వాత ఆ సినిమాలో చూపించిన విషయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో చూపించిన వాటిలో కొన్ని మాత్రమే వాస్తవాలు ఉన్నాయని, చాలా విషయాలను తప్పుగా చూపించారనే వాదన తెరపైకి వచ్చింది.

తాజాగా ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితంగా ఉండే డాక్టర్ కుసుమ ఎన్. రావు ఈ సినిమాపై స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే మాట వినడమే తనకు ఇష్టం లేదని తెలిపారు. అలాంటి టైటిల్‌కు ఎన్టీ రామారావు భార్య బసవతారకం మాత్రమే అర్హురాలని తెలిపారు.

ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను

ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను

‘మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీ రామారావుకు పక్షవాతం వచ్చిన మాట నిజమే. అంతకు ముందే లక్ష్మీ పార్వతి... జీవిత చరిత్ర రాస్తానని చెప్పి రామారావు వద్ద చేరారు. ఆరోగ్యం బాగోలేని సమయంలో లక్ష్మీ పార్వతి దగ్గరుండి చూసుకున్న మాట నిజమే. ఒక డాక్టర్‌గా ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆరోగ్యం బాగోలేనపుడు ఎవరు మనల్ని చూసుకుంటే వారిపై మనకు అభిమానం ఉంటుంది. అందుకే లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అంత వరకు ఒకే. కానీ దాన్ని ఆదునుగా తీసుకుని ఆయన్ను లక్ష్మీ పారవతి ఇబ్బంది పెట్టారు’ అని డాక్టర్ కుసుమ తెలిపారు.

ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా నాకు తెలుసు

ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా నాకు తెలుసు

‘లక్ష్మీ పార్వతి తన కొడుకును దత్తత తీసుకోవాలని ఎన్టీఆర్ మీద చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు. దీంతో అప్పటికే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మీ పార్వతి మళ్లీ తిరిగి పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా నాకు తెలుసు’ అని డాక్టర్ కుసుమ స్పష్టం చేశారు.

ఆఖరు సమయంలో సరిగ్గా చూసుకోలేదు

ఆఖరు సమయంలో సరిగ్గా చూసుకోలేదు

ఎన్టీఆర్ ద్వారా పిల్లలను కనేందుకు మానసికంగా ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆఖరి సమయంలో సరిగ్గా చూసుకోకుండా, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అలాంటి మహానుభావుడికి ఆ పరిస్థితా? అని చాలా బాధ పడ్డట్లు డాక్టర్ కుసుమ గుర్తు చేసుకున్నారు.

లక్ష్మీ పార్వతి చేసింది త్యాగం కాదు

లక్ష్మీ పార్వతి చేసింది త్యాగం కాదు

‘లక్ష్మీ పార్వతి త్యాగం చేశారని కొందరు అంటున్నారు.. త్యాగం అంటే ఏమిటి? ఎన్టీ రామారావు ఏమైనా మామూలు వ్యక్తా? ఏ విషయంలో త్యాగం చేసినట్లు? ఈమె ఏమైనా రాజకుమారా... ఏమీ లేని వ్యక్తిని చేసుకుని త్యాగం చేశారా? వయసు తేడా అయినంత మాత్రాన త్యాగం అనలేము. అలాంటి వివాహాలు సర్వసాధారణంగా జరిగే విషయాలే’ అని డాక్టర్ కుసుమ వ్యాఖ్యానించారు.

నందమూరి తారకరామారావు భార్య అనే హోదా లభించడమే లక్ష్మిపార్వతికి పెద్ద వరం. కానీ దాన్ని దుర్వినియోగం చేసి తన వంటిట్లో కేబినెట్ పెట్టి రాజకీయాలు చేసింది అని కుసుమ ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X