మహేష్ బాబుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
హీరో మహేష్ బాబుపై...మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారట. ఎందుకో తెలుసా...దూకుడు సినిమాలో డైలాగులు చాలా పాపులర్ కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 'మైండ్ లో ఫిక్సయితే బ్లయిండ్ గా వెళ్లి పోతా" లాంటి డైలాగులు మహేష్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు పెంచాయి. దూకుడుతో సమానంగా ఊరసర వెళ్లి వస్తున్నా ఆ సినిమాపై జనాల్లో పెద్దగా చర్చ జరుగడం లేదు. దీంతో ఎన్టీఆర్ ప్రత్యర్థి అయిన మహేష్ బాబుకు ఇంత పేరు రావడం నందమూరి ఫ్యాన్స్ అస్సలు జీర్ణించు కోలేక పోతున్నారట.
జూనియర్ ఎన్టీఎర్, ఇతర నందమూరి హీరోలు తరచూ తమ వంశాన్ని, వారసత్వాన్ని పొగుడు కుంటూ తమ సినిమాల్లో డైలాగులు రాయించుకుంటుంటారు. దీంతో వీరిపై డబ్బా హీరోయిలు అనే విమర్శలు కూడా ఉన్నాయి. నందమూరి హీరోలు దంచే డబ్బా డైలాగులు ఫ్యాన్స్ కు నచ్చినా సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తూనే ఉంటారు. దీంతో ఈ విషయమై తమ అభిమాన హీరోకి సూచనలు చేసి, మహేష్ బాబును మించే విధంగా డైలాగులు, స్టయిల్ ఉండాలని జూనియర్ ను కోరేందుకు సిద్ధం అవుతున్నారట.


Click it and Unblock the Notifications











