ఎన్టీఆర్ ను దుర్మార్గునిగా చూపించిచారంటూ...వర్మపై తిరగబడ్డ ఫ్యాన్స్...
రక్త చరిత్ర మార్నింగ్ షో ముగిసింది. అనంతపురం జిల్లా సంగతి ఎలా ఉన్నా రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర విజయవాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ ఆవిష్కర్త స్వర్గీయ ఎన్టీఆర్ ను రక్తచరిత్రలో దుర్మార్గునిలా చిత్రించారని ఆయన అభిమానులు చిందులేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఓ సైకో అనీ, దేవుడిలాంటి మనిషిని దుర్మార్గుడిలా చూపించారని మండిపడుతున్నారు. జనం ఎలా పోతే నాకేంటి..డబ్బు వస్తే చాలన్నదే ఆయన ద్యేయంగా ఉందని ధ్వజమెత్తుతున్నారు. రక్త చరిత్ర సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తులో బెజవాడ రౌడీలంటూ విజయవాడలో కనుమరుగువుతున్న రౌడీయిజాన్ని మళ్లీ తెరపైకి తెస్తానని చెప్పడాన్ని చూస్తే వర్మ ఖచ్చితంగా మానసికంగా బలహీనులయ్యారని అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్లు బాలీవుడ్ తన సినిమాలతో అతలాకుతలం చేసి తిరిగి టాలీవుడ్ ను అదే స్థాయిలో ఊపేస్తున్నారు. మరి ఈ రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత వర్మకి ప్రేక్షకుల నుండి ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











