అభిమాని అంటే ఈ బుడ్డోడే.. ఎన్టీఆర్ సినిమా టైటిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సామెత వేరే రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడువులైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కు వీరాభిమానులు చాలా మందే ఉన్నారు.

ఎన్టీఆర్ పై ఓ బుడ్డోడి అభిమానం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. అరవింద సమేత చిత్ర టైటిల్ ని తన తలపై కనిపించేలా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. ఈ ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. తమ అభిమాన హీరోలపై వివిధ రూపాల్లో ఫాన్స్ అభిమానం చాటుకుంటుంటారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయనడానికి ఈ ఫోటోనే నిదర్శనం. దసరాకు అరవింద సమేత విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

దసరా కానుకగా
దసరా కానుకగా అరవింద సమేత చిత్రం విడుదల కానుంది. అక్టోబర్ 10 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అనుకున్న సమయానికి చిత్రం పురయ్యేలా త్రివిక్రమ్ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బలమైన యాక్షన్ అంశలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో ఇప్పటికే అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రెండు భిన్నకోణాలలో కనిపిస్తాడని అంటున్నారు.

హారిక అండ్ హాసిని నిర్మాణం
త్రివిక్రమ్ చిత్రాలని వరుసగా నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇషా రెబ్బ మరో కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











