RRR: తొక్కుకుంటూ పోవాలే.. సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏకంగా గాలిలో.. కార్లతో..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్లో కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ క్రియేట్ చేస్తున్న RRR ఈనెల 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా మొదటి రోజు మొదటి షో నుంచి చూడాలి అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కంటే కాస్త బజ్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం తొక్కుకుంటూ పోవాలే అనే ట్యాగ్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా గాలిలో.. అలాగే కార్లతో కూడా సినిమా ట్యాగ్స్ ను వైరల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

ఓవర్సీస్ లో కూడా..
RRR సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇద్దరు మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య 450 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా దాదాపు 1 మిలియన్ డాలర్లను అందుకునే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హావా..
ఇంకా సినిమా విడుదల కాకముందే అక్కడ ఎన్టీఆర్ అభిమానులు సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యే విధంగా హైలెట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్క అంశాన్ని ఒక రేంజ్ లో హైలెట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇదివరకే ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో ఒక థియేటర్లో టికెట్లు అన్నిటిని ఒకేసారి కొనుగోలు చేయడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో ఏ స్థాయిలో ఉన్నారో మరో సారి RRR సినిమాతో చాలా క్లారిటీ గా అర్థమైంది. థియేటర్ మొత్తం టికెట్లను ఒక వర్గం అభిమానులు మాత్రమే కొనుగోలు చేశారు అంటే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ట్రెండింగ్ లిస్టులో RRR
జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మార్చి 25వ తేదీన మొత్తానికి RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. సినిమాలోని ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. అందుకు ప్రధాన కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే చెప్పాలి.
ఆకాశంలో.. తొక్కుకుంటూ పోవాలే..
తొక్కుకుంటూ పోవాలే అనే డైలాగ్ ఎన్టీఆర్ చెప్పగా ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ఇక అభిమానులు చాలా డిఫరెంట్ ఆ లైన్ ను హైలెట్ చేస్తున్నారు. ఏకంగా గాలిలో విమానాలతో తొక్కుకుంటూ పోవాలి అని డైలాగ్ ను గాలిలో కనిపించేలా చేశారు. అమెరికా లో చోటు చేసుకున్న ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
Recommended Video
కార్లతో కూడా..
కెనడాలో కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా వినూత్నంగా సినిమా పేరును హైలెట్ చేస్తున్నారు. ఒక పార్కింగ్ ఏరియా లో ఖరీదైన కార్లు RRR ఆకారంలో పార్క్ చేసి చూపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పేరును కూడా చూపించడం విశేషం. ప్రస్తుతం RRR టైటిల్ పాటు తొక్కుకుంటూ పోవాలే అనే ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది అంటే విడుదల తర్వాత ఇంకా ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











