సైరా డైరెక్టర్‌ సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం.. రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌పై సురేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వివరాల్లోకి పోతే..

నందమూరి హీరో సినిమాతోనే మెగా ఫోన్ పట్టి చివరకు..

నందమూరి హీరో సినిమాతోనే మెగా ఫోన్ పట్టి చివరకు..

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకొని సైరా నరసింహా రెడ్డి సినిమా తీశారు. కానీ ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు సురేందర్ రెడ్డి.

ఎన్టీఆర్ మేనేజర్ బ్లాక్ మెయిల్ చేయడం కారణంగానే..

ఎన్టీఆర్ మేనేజర్ బ్లాక్ మెయిల్ చేయడం కారణంగానే..

తాను ప్రభాస్‌తో కలిసి 2006లోనే సినిమా చేసే వాడినని, కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ తనను బ్లాక్ మెయిల్ చేసి.. తారక్‌తో కలిసి సినిమా చేయాలని బలవంతం చేశాడని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్‌తో ‘అశోక్' సినిమా చేశానని అన్నారు. 'అశోక్' కథను తాను రూపొందించలేదని, వారే కథను రాసుకుని నన్ను తీయమని చెప్పారని తెలిపారు. చివరకు ఆ సినిమా ఫ్లాపైంది. అనవసరంగా తారక్‌తో ఈ సినిమా తీశానని చాలా
ఆ తర్వాత బాధపడ్డానని సురేందర్ రెడ్డి అన్నారు.

సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం.. రచ్చ రచ్చ

సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం.. రచ్చ రచ్చ

సురేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తారక్‌ అభిమానుల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తించాయి. దీంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆయనపై ఓ రేంజ్‌లో బూతుల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సురేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌పై రచ్చ రచ్చ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

బయటకు చెప్పలేని పదాలు వాడుతూ..

బయటకు చెప్పలేని పదాలు వాడుతూ..

బయటకు చెప్పలేని విధంగా సురేందర్ రెడ్డిని బూతులు తిడుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ లైఫ్ ఇస్తే ఆయన్నే ఇలా అంటావా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
ఇంతకీ సురేందర్ రెడ్డి ఎందుకలా మాట్లాడారు?

ఇంతకీ సురేందర్ రెడ్డి ఎందుకలా మాట్లాడారు?


ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి సురేందర్ రెడ్డి కామెంట్స్ చేయడం వెనుక బలమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'సైరా' తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని భావించిన సురేందర్ రెడ్డి.. తారక్‌కి ఓ కథను వినిపించాడట. అది తారక్‌కి నచ్చకపోవడంతో ఆయన ఒప్పుకోలేదట. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి.. జూనియర్‌పై కామెంట్స్ చేశాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X