»   » ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేసిన రాజమౌళి (ఫోటోస్)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేసిన రాజమౌళి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక, ఓవర్సీస్ మార్కెట్లో గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు వేసారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఏరియాలో మల్లిఖార్జున, బ్రమరాంభ థియేటర్లలో తెల్లవారు ఝామున 4 గంటలకే బెనిఫిట్ షోలు పడ్డాయి. బెనిఫిట్ షో చూసేందుకు ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ థియేటర్లకు తరలి వచ్చారు.


ఈ బెనిఫిట్ షోకు ప్రముఖ దర్శకుడు, ఎన్టీఆర్‌కు సన్నిహితుడు.... ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెం.1 సినిమాతోనే దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టి ఇపుడు బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని నిర్మించే స్థాయికి ఎదిగిన రాజమౌళి కూడా వచ్చారు. చిత్ర నిర్మాత నవీన్ యెర్నేని సైతం ఈ షోకు వచ్చి అభిమానుల రెస్పాన్స్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.


స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...


భారీ కటౌట్

భారీ కటౌట్

బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్.


భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్

భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్

బోనిఫిట్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.


హంగామా

హంగామా

జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ అభిమానుల హంగామా.


వేల రూపాయలు

వేల రూపాయలు

బెనిఫిట్ షో చూసేందుకు కొందరు అభిమానులు ఒక్కో టిక్కెట్ కు వేల రూపాయలు ఖర్చు చేసారు.


రోడ్ల మీదే..

రోడ్ల మీదే..

అభిమానులు భారీగా రావడంతో స్థలం లేక కూకట్ పల్లి మెయిన్ రోడ్డు మీదనే అభిమానులు భారీ సంఖ్యలో ఇలా వాహనాలు పార్క్ చేసారు.


నిర్మాత

నిర్మాత

బెనిఫిట్ షోకు హాజరైన జనతా గ్యారేజ్ నిర్మాత నవీన్ యెర్నేని.


రాజమౌళి

రాజమౌళి

జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసేందుకు తెల్లవారుఝామునే దర్శకుడు రాజమౌళి కూడా వచ్చారు.


కిక్కిరిసిన అభిమానుల మధ్య నుండి

కిక్కిరిసిన అభిమానుల మధ్య నుండి

థియేటర్ వద్ద కిక్కిరిసిన ఎన్టీఆర్ అభిమానుల మధ్యలో రాజమౌళి.


సెక్యూరిటీ

సెక్యూరిటీ

రాజమౌళి కోసం ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేసారు.


కార్తికేయ

కార్తికేయ

రాజమౌళితో పాటు ఆయన తనయుడు కార్తికేయ కూడా హాజరయ్యారు.


English summary
Check out photos of NTR Fans Hungama at Janatha Garage Benefit Show at Mallikarjuna Bramarambha Theatre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X