twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై నమోదైన కేసు.. మీడియా చేతికి FIR కాపీ.. రిపోర్టులో షాకింగ్ అంశాలు

    |

    హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాచోప్రా అందించిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. మీడియా చేతికి లభించిన ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పొందుపరిచిన అంశాలు ఇవే..

    Recommended Video

    NTR Meera Chopra Row : Meera Chopra Supporters Demand NTR's Explanation
    గ్యాంగ్ రేప్ చేస్తామని..

    గ్యాంగ్ రేప్ చేస్తామని..

    లాక్‌డౌన్ సమయంలో #Askmeera అంటూ హీరోయిన్ మీరా చోప్రా ట్విట్టర్‌లో మంగళవారం లైవ్ చాటింగ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు ఎన్టీఆర్ గురించి తెలియదు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని అన్నారు. దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ.. గ్యాంగ్ రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

    పలు చోట్ల మీరా చోప్రా ఫిర్యాదు

    పలు చోట్ల మీరా చోప్రా ఫిర్యాదు

    తనపై చేసిన ట్రోలింగ్‌కు సంబంధించిన ట్వీట్లను మీరా చోప్రా హైదరాబాద్ పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి, అలాగే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మీరా ఫిర్యాదుకు స్పందించి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదుతో ఎఫ్ఐఆర్ తంతును కూడా పూర్తి చేశారు. FIR కాపీని మీడియాకు రిలీజ్ చేశారు.

     ఎఫ్ఐఆర్ కాపీలో

    ఎఫ్ఐఆర్ కాపీలో

    FIR. కాపీలో పేర్కొన్న ప్రకారం.. తనపై చేసిన ట్రోల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు అందించినట్టు మీరా పేర్కొన్నారు. అలాగే కొన్ని ట్వీట్లను కొందరు డిలీట్ చేశారు. వాటి ఆధారాలు తన వద్ద ఉన్నాయి. అలాగే ఆ అకౌంట్లను తొలగించాలని తన పిటిషన్‌లో మీరా చోప్రా కోరారు. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

    నమోదు చేసిన సెక్షన్ల ఇవే

    నమోదు చేసిన సెక్షన్ల ఇవే

    FIR కాపీలో మీరా చోప్రా ఫిర్యాదు చేసిన సమాయాన్ని, సెక్షన్లను నమోదు చేశారు. మీరా చోప్రా తన ఫిర్యాదును బుధవారం అంటే జూన్ 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్‌లైన్ ద్వారా అందజేశారు. ఆ ఫిర్యాదుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై క్రైమ్ నంబర్ 997/2020sy ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం, అలాగే ఐపీసీ 506, 509 ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టిన పోలీసులు అకౌంట్లు, వారికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

    English summary
    Actor Meera Chopra gets worst moments in Twitter while she come to Askmeera event. On this Chat session, She said I Like Mahesh Babu, I dont know NTR, Then NTR fans trolls heavily her. In This situation, He complains to Hyderabad police and Cyberabad police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X