ప్రణతీకి నచ్చిన ‘శక్తి’ సాంగ్ అదే: జూ ఎన్టీఆర్
తన కాబోయే భార్య లక్ష్మీ ప్రణతి గురించి యన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యులో సిగ్గు, ఆనందం కలగలిసిన అనుభూతితో చెప్పుకొచ్చాడు. ఇటీవల విడుదలైన 'శక్తి' పాటల గురించి మీ కాబోయే శ్రీమతి కామెంట్ ఏమిటి? అనడిగితే, "తనకి పాటలన్నీ బాగా నచ్చేశాయి. మరీ ముఖ్యంగా 'ప్రేమదేశం యువరాణీ...' పాట అయితే తెగ న్చ్చేసిందట. ఆడియో ఎన్నిసార్లు విన్నా ఆ పాటే బాగా నచ్చిందని చెబుతోంది" అంటున్నాడు, త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న ఎన్టీఆర్. లక్ష్మీ ప్రణతికి నచ్చిన ఆ పాటను అభిమానులు, శ్రోతలూ కూడా బాగా ఇష్టపడుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ మంచి మెలోడీతో మణిశర్మ రూపొందించిన ఆ పాట అందర్నీ ఎంతగానో హాంట్ చేస్తోంది. ఇక పిక్చరైజేషన్ అయితే అదుర్సే అంటున్నారు!


Click it and Unblock the Notifications











