గంధర్వ మహల్ కి...జూ. ఎన్టీఆర్ షిఫ్ట్
హైదరాబాద్ : మంచు ఫ్యామిలీ... ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంతో పాపులర్ అయిన లొకేషన్..గంధర్వ మహల్. ఇప్పుడు అక్కడకి జూ.ఎన్టీఆర్.. షిప్ట్ అవటానికి నిర్ణయించుకున్నాడు. జనవరి 6 నుంచి పిభ్రవరి 26 దాకా జరిగే రెగ్యులర్ షెడ్యూల్ ని అక్కడ ప్లాన్ చేసారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం రభస. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ - ఈ మూడక్షరాల పేరు... పూనకం తీసుకొస్తుంది అభిమానులకు. ఎన్టీఆర్ అంటే దర్శకులకు సమ్మోహన శక్తి. ఎన్టీఆర్ అంటే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే నిధి. సంభాషణలు పలికే చాతుర్యానికి ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే. నాట్యంలో మెరుపు వేగం చూసి నింగిలోని 'మెరుపు' కూడా మైమరచిపోతుంది. ''పాత్రలో ఒదిగిపోవడం, కొత్త వన్నెలు తీసుకురావడం ఎన్టీఆర్‌కే సాధ్యం...'' అని ఎవరైనా చెబితే అందులో అక్షరం కూడా అతిశయోక్తి లేదు. అందుకే ఆయన వెనుక విజయాలు, విజయాల వెనుక రికార్డులూ నడిచొచ్చేస్తుంటాయి. ఇప్పుడూ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు.
సినిమా సినిమాకీ ఎదగడం అలవాటు చేసుకొన్నాడు ఎన్టీఆర్. 'ఇలాంటి పాత్రలకు మాత్రమే' అనే షరతులు ఎన్టీఆర్ దగ్గర లేవు. 'ఈ పాత్రలో ఎన్టీఆర్ సరిపోడేమో' అనే సందేహాలు ఎవరికీ రావు. 'స్టూడెంట్ నెం.1', 'ఆది', 'సింహాద్రి', 'రాఖీ', 'యమదొంగ', 'అదుర్స్', 'బృందావనం'... వీటిలో ఏ సినిమా మరో సినిమాకి పోలిక తీసుకురాలేదు. ప్రతీ సినిమాలోనూ కొత్త ఎన్టీఆర్ కనిపించాడు. తొడగొట్టాడు, గొడ్డలి పట్టాడు, కన్నీరు కార్చాడు, నవ్వాడు, నవ్వించాడు, స్లిమ్ అయ్యాడు, లవర్‌బోయ్‌లా మారాడు - ఎన్నో చేశాడు. తనని తాను మార్చుకొన్న ప్రతిసారీ ఎన్టీఆర్‌కి విజయం దక్కింది. ఇప్పుడు అభిమానుల బిరుదుకి తగ్గట్టు 'యంగ్ టైగర్'లా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











