ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి అదుర్స్ అనే టైటిల్ ని ఖాయం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ చిత్రంలో నయనతార, షీలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూంటే..ఛోటా కె నాయుడు కెమెరా అందిస్తున్నాడు. స్టన్ శివ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. కొడాలి నాని సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి వల్లభనేని వంశిమోహన్ నిర్మిస్తున్నాడు. ఇక అదుర్స్ అనే టైటిల్ కి ఇప్పటికే పరిశ్రమ వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది. ఆది, సాంబ చిత్రాల తర్వాత వి.వి.వినాయిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో అభిమానుల్లోనూ మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.