ఫ్లాప్ డైరక్టర్ తో ఎన్టీఆర్?

ఇదంతా ఇరవై ఒకటవ తారీఖున ఎన్టీఆర్ ని కలసి వంశి కధ వినిపించి ఓ.కె చేయించుకోవటంతో జరిగింది. అలాగే దిల్ రాజు ప్రస్తుతం తన దృష్టినంతా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నాగ చైతన్య సినిమాపై పెట్టారు. వాసు వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. అలాగే వంశి చెప్పిన కథ కూడా పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు మున్నా సినిమా చూసి టేకింగ్ నచ్చిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ వంశిని మెచ్చుకోవటం ఈ రోజు ఈ కాంబినేషన్ కి కారణమవుతోందని తెలుస్తోంది.
స్వతహాగా వంశి సౌండ్ పార్టీ కావటంతో ప్రొడక్షన్ లో కూడా కొంత పెట్టుబడి పెడతాడు అని చెప్పుకుంటున్నారు. అందుకే మున్నా ఏమైనా దిల్ రాజు చలించలేదని వారి టాక్. ఏదైమైనా టేకింగ్ నే నమ్ముకుని,కథను,క్యారక్టేరైజేషన్ ని గాలికొదిలేసే వంశి కథని మరొక్కసారి ఎనాలిసిస్ చేసుకుంటే కంటిన్యూగా సాగే ఎన్టీఆర్ హిట్స్ కి బ్రేక్ ఉండదని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











