మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన జూ ఎన్టీఆర్!
Recommended Video

సోషల్ మీడియాలో ఇపుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇతరలకు ఛాలెంజ్ విసురుతుండటం అభిమానుల్లోనూ ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెంచుతోంది. అలా సినీ నటుడు మోహన్ లాల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్..... మహేష్ బాబు, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్ రామ్, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు.
టెర్రిబుల్ వీడియో
మోహన్ లాల్ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్..... అతి కష్టమైన ఎక్సర్‌సైజులు చేశాడు. ఈ వీడియో చూస్తే ఎన్టీఆర్ ఆ వర్కౌట్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇది చూడటానికి చాలా టెర్రిబుల్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దర్శకులను వదల్లేదుగా...
నటీనటులు తెరపై స్మార్ట్‌గా కనిపించడానికి జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేయడం కామనే. అయితే దర్శకులు మాత్రం ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విషయంలో వారిని కూడా వదల్లేదు ఎన్టీఆర్. రాజమౌళి, కొరటాల శివలకు కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు.

ఉపాసన... మీ ఆయనకు చెప్పు
అయితే ట్విట్టర్లో రామ్ చరణ్‌కు ఖాతా లేక పోవడంతో..... ఉపాసన ఖాతాను ఎన్టీఆర్ సందేశం పంపారు. నేను విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ గురించి మీ ఆయనకు చెప్పు అంటూ అందులో పేర్కొనడం గమనార్హం.
మోహన్‌లాల్
ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తూ అందరూ తాము వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు పోస్టు చేస్తుంటే.... మోహన్ లాల్ మాత్రం కేవలం ఫోటోతో సరిపెట్టారు. సూర్య, ఎన్టీఆర్, పృధ్విలకు ఆయన ఛాలెంజ్ విసిరారు.


Click it and Unblock the Notifications











