'ఆర్ఆర్ఆర్‌' కోసం 100 దాటేసిన జూ.ఎన్టీఆర్.. షాకింగ్ లుక్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. టైటిల్, ఇతర విశేషాలని రాజమౌళి త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని జక్కన్న ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న పాత్రల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారట. తాజాగా ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

యంగ్ టైగర్ సెంచరీ కొట్టేశాడు

యంగ్ టైగర్ సెంచరీ కొట్టేశాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెంచరీ కొట్టడం ఏంటని అనుకుంటున్నారా. ఇది ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి వినిపిస్తున్న అత్యంత క్రేజీ అప్డేట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహకందని విధంగా బరువుపెరుగుతున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ 100 కేజీల బరువుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషించే పాత్ర కోసం భారీ కాయంతో కనిపించాల్సి ఉందట. యమదొంగ చిత్రం కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఎన్టీఆర్ తో మరో ప్రయోగం చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న లుక్

వైరల్ అవుతున్న లుక్

యమదొంగ చిత్రం కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఎన్టీఆర్ తో మరో ప్రయోగం చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కాయంతో కనిపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ లుక్ చూసిన అభిమానులంతా షాక్ కి గురవుతున్నారు.

తీవ్రంగా శ్రమిస్తూ

తీవ్రంగా శ్రమిస్తూ

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో బరువు కోసం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆడియన్స్ వెండితెరపై చూస్తారట. ఎన్టీఆర్ భారీ కాయంతోపాటుగా గుబురు గడ్డంతో కనిపిస్తారట. ఈ క్రేజీ న్యూస్ తో ఆదిలోనే ఎన్టీఆర్ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అరవింద సమేత చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ కోసం లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలోనే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ పొందాడు.

ముంబై హెయిర్ స్టైలిస్ట్

ముంబై హెయిర్ స్టైలిస్ట్

ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ లుక్ ని ప్రముఖ ముంబై హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, చరణ్ మునుపెన్నడూ కనిపించని లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి కీలక సన్నివేశాలని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. త్వరలోనే తొలి షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కనీవినీ ఎరుగని రీతిలో ఉండబోతున్నాయని సమాచారం.

త్వరలోనే మరో క్రేజీ న్యూస్

త్వరలోనే మరో క్రేజీ న్యూస్

ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ని రాజమౌళి ఈ నెల 12న 12 గంటలకు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీసుగా, ఎన్టీఆర్ బందిపోటుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ గురించి వస్తున్న అనేక రకాల ఊహాగానాలకు చెక్ పడాలంటే రాజమౌళి స్పందించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X