twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తనతో పాటు పని చేస్తున్న దర్శకులకు గిఫ్టులు ఇచ్చే అలవాటున్న జూ ఎన్టీఆర్...ఆ మధ్య శ్రీను వైట్లకు రూ. 8 లక్షల విలువ చేసే వాచీని బహుమతిగా ఇచ్చాడు.

    తాజాగా హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్టు అందజేసాడు జూనియర్. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రెట్లింగ్ కంపెనీ తయారు చేసే ఖరీదైన వాచీని ఉగాది సందర్భంగా బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం హరీష్ శంకర్ తన ట్విట్టర్లో వెల్లడించడంతో పాటు, అతనికి థాంక్స్ చెబుతూ ఆ వాచీ ఫోటోను కూడా పోస్టు చేసాడు. 1885లో స్థాపించబడిన ఈ సంస్థ రూ. 1.5 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువ చేసే వాచీలను తయారు చేస్తూ ఉంటుంది. జూనియర్ నుంచి హరీష్ గిఫ్టుగా పొందిన వాచీ ఖరీదు రూ. 5 లక్షలపైనే ఉంటుందని అంచనా.

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    జూనియర్ ఎన్టీఆర్ నుంచి హరీష్ శంకర్ అందుకున్న గిఫ్ట్ వాచ్

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    జూనియర్ ఎన్టీఆర్ నుంచి హరీష్ శంకర్ అందుకున్న గిఫ్ట్ వాచ్

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    సినిమా ప్రారంభోత్సవం నాటి దృశ్యాలు

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    సినిమా ప్రారంభోత్సవం నాటి దృశ్యాలు

    హరీష్ శంకర్‌కు జూ ఎన్టీఆర్ లక్షల విలువచేసే గిఫ్ట్ (ఫోటోలు)

    సినిమా ప్రారంభోత్సవం నాటి దృశ్యాలు

    ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    Jr NTR gifts an expensive Breitling watch to the director of his current film Harish Shankar. The director shared the same on his micro blogging account "BREITLING Watch gifted by Young Tiger .... tarak9999 Saaaar it's too "heavy "gift It's Just AweeeeeeeeSome thank You Young Tiger :-)" (sic)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X