twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara: బింబిసారకు ఎన్టీఆర్ రివ్యూ.. ఆయన తప్ప ఎవరూ చేయలేరు అంటూ!

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం బింబిసార ఆగస్టు 5న ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పాజిటీవ్ రివ్యూస్ వుతున్నాయి. బాక్సాఫీసు వద్ద మంచి పాజిటివ్ టాక్‌ రావడంతో థియేటర్స్‌ అన్నీ హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఠీఆర్ చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
    కీరవాణి

    కీరవాణి

    నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి నేపధ్య సంగీతం అందించగా చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలలో నటించారు.

     టైం ట్రావెల్

    టైం ట్రావెల్

    నందమూరి హీరో కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బింబిసార' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కింది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం.. ఆ తర్వాత ఏమి జరిగింది అనే అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది.

    ఎవరూ చేయలేరు అంటూ

    ఎవరూ చేయలేరు అంటూ

    ఇక ఫస్ట్ టైం డైరెక్టర్ వశిష్ఠ్ మేకింగ్‌కు నందమూరి ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా బింబిసార మూవీపై యంగ్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 'బింబిసార మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ఆడియన్స్ సినిమాను బాగా ఆస్వాదిస్తున్నారని పేరొక్ననారు. ప్రేక్షకులకు సినిమా నచ్చినప్పుడే మంచి అనుభూతి కలుగుతుందని, కళ్యాణ్ రామ్ అన్న బింబిసార రాజుగా నువ్వు తప్ప ఈ క్యారెక్టర్‌ను ఎవరూ చేయలేరు అంటూ కామెంట్ చేసారు.

    హాట్ టాపిక్ గా

    హాట్ టాపిక్ గా

    డైరెక్టర్ విశిష్ఠ్ అనుభవం దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడని, ది లెజండరీ ఎంఎం కీరవాణిగా బింబిసార సినిమాకు వెన్నెముకగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక ఈ మూవీని విజయవంతమయ్యేలా చేసినందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు..' అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

    సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో చందమామ కధలా టైమ్ ట్రావెల్ అనే పాయింట్‌తో తెరకెక్కిన బింబిసార మూవీ అభిమానుల అంచనాలను అందుకోవడమే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. ఇక సినిమా చూసిన సాధారణ ఆడియన్స్ కూడా బింబిసార బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఎన్టీఆర్ సినిమా బాగుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గటుగానే సినిమా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

    English summary
    Ntr Gives Bimbisara review through his social media accounts and praises kalyan ram and director vasisth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X