జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మూవీ ‘రామయ్యా వస్తావయ్యా’(ఫస్ట్ లుక్)
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు 'రామయ్యా వస్తావయ్యా' అనే టైటిల్ ఖరారు చేసారు. దానితో పాటు ఈ రోజు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఆగస్టు 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ మోడ్రన్ లుక్‌లో గద పట్టుకుని ఉండటంతో సినిమా కాన్సెప్టు వెరైటీగా ఉంటుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే...ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి అతిథి పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఉండనుంది. దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











