twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్..యమస్పీడు

    By Staff
    |

    Jr Ntr
    తెరపైనే కాదు తెరవెనుకా ఎన్టీఆర్ యమస్పీడుగానూ, ధైర్యవంతుడుగానూ ఉంటాడని చెప్తూంటారు. అందులోనూ మొన్న కారు ఏక్సిడెంట్ అయిన దగ్గరనుండీ ఈ టాపిక్ పలు చోట్ల వినపడుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ కారు తోలకం యమస్పీడుగా ఉంటుంది. దాంతో ఎన్టీఆర్ షూటింగ్ కి కారులో వస్తున్నాడంటే గేటు నుంచి కారు పార్కింగ్ చేసే ప్రాంతం వరకూ ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ఆయన కారు అంత వేగంగా దూసుకు వస్తుందట. ఈ విషయం తెలుగు పరిశ్రమలో చాలా మందికి అనుభవమేనంటున్నారు.

    ఆ మధ్య హైదరాబాదులోని ఓ పెద్ద స్టూడియోలోకి ఎన్టీఆర్ వేగంగా ఇలాగే వచ్చారు. అప్పటికే అక్కడో సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కారులో రయ్యమని స్పాట్‌కు దూసుకొచ్చాడు. అప్పటివరకూ షూటింగ్ సన్నివేశాలను తిలకిస్తున్న ప్రేక్షకులు కారు అతివేగంగా రావడాన్ని చూసి జడుసుకుని తలోదిక్కున పారిపోయారు. దూసుకువచ్చిన ఎన్టీఆర్ కారు చివరకు సదరు స్టూడియోలోని ఓ గోడకు గుద్దుకునేంతగా వెళ్ళి ఆగింది. అయితే ఆ స్పీడు దెబ్బకు గోడ కొంత కూలిపోయిందట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇదేమీ పట్టించుకోనట్లుగా చాలా కూల్ గా మామూలుగా కారులోంచి దిగి షూటింగ్ పనుల్లో నిమగ్నమైపోయాడట. దాంతో ఆ దర్సకుడుకీ తనకీ ఉన్న చనువు కొద్దీ సరదాగ కావాలనే చేసారని చెప్పుకున్నారు.

    అయితే అప్పట్నుంచి జూనియర్ ఎన్టీఆర్ కారు వస్తుందంటే మాత్రం ఆ స్టూడియోలో గేటు నుంచి పార్కింగ్ ఏరియా వరకూ లైన్ క్లియర్‌గా ఉంటుంది . అయితే ఎన్టీఆర్ కి డ్రైవింగ్ పై మంచి పట్టు ఉందిని, మొన్న మినహాఇస్తే ఎప్పుడూ ఇలాంటి ఏక్సిడెంట్స్ జరగలేదని అంటూంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎన్నికలు ముగియడంతో సినిమా కథలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వినాయిక్ దర్శకత్వంలో వచ్చే అదుర్స్ పూర్తవగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలయ్యే ఎమ్మల్యే చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే మరో ప్రక్క రాజమౌళి తో కలిసి ఓ పౌరాణిక చిత్రం ప్లానింగ్ లో కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X