జూ ఎన్టీఆర్ దంపతులకు ఆడపిల్ల పుట్టిందని రూమర్స్ హల్ చల్!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీమంతం ఫంక్షన్ కూడా నిర్వహించారు. తాజాగా ఎన్టీఆర్ దంపతులకు సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి దంపతులకు ఆడపిల్ల పుట్టిందని కొన్ని వెబ్ సైట్లు వార్తలు ప్రచురించడంతో ఇది నిజం అని నమ్మిన అభిమానులు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేశారు. అయితే ఎన్టీఆర్ నుండి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాక పోవడంతో అనుమానం వచ్చిన కొందరు తారక్ మేనేజర్ మహేష్ ఎస్ కోనేరును ట్విట్టర్ ద్వారా సంప్రదంచారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని, ఇది కేవలం ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పారు.

గతంలో కూడా ఎన్టీఆర్ మీద ఇందుకు సంబంధించి అనేక రూమర్స్ వచ్చాయి. తన భార్య గర్భవతి అయినందువల్లే ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2ను రిజిక్ట్ చేశారని, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తారక్ ఈ షోకు కమిట్ అయితే కుటుంబంతో గడిపే పరిస్థితి ఉండదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.
కాగా...ఎన్టీఆర్ దంపతులకు ఇప్పటికే అభయ్ రామ్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీరు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఏదైనా విశేషం ఉంటే ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటిస్తారు. సోషల్ మీడియాలో వినిపించే రూమర్లు నమ్మ వద్దని ఎన్టీఆర్ మేనేజర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











